ఆస్తి మొత్తం కూతురికి ఇచ్చేయొచ్చు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: పెళ్లి అయిన మహిళకు ఆస్తి హక్కు విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కట్టుకున్న భార్యకు, ఏకైక కుమారుడికి ఏమి ఇవ్వకుండా పెళ్లి అయిన కుమార్తెకు మొత్తం ఆస్తి ఇచ్చేయొచ్చని సుప్రీం కోర్టు తన తీర్పులో చెప్పింది. పెళ్లి అయిన మహిళకు తండ్రి ఆస్తిలో హక్కు ఉందని స్పష్టం చేసింది.

పశ్చిమ బెంగాల్ సహకార సంఘాల నిబంధనల ప్రకారం సొసైటిలోని ఒక ఫ్లాట్ ఓనర్ తన తరువాత ఆ ఇంటిని కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రం ఇవ్వాలని నియమాలు ఉన్నాయి. ఈ నిబంధనలు చూపిస్తూ ఓ మహిళ, ఆమె కుమారుడు పశ్చిమ బెంగాల్ హై కోర్టును ఆశ్రయించారు.

తన భర్త కొనుగోలు చేసిన ఫ్లాట్ యాజమాన్యాన్ని మేనేజింగ్ కమిటీ వాళ్లు తమ కుమార్తె ( వివాహం అయ్యింది) ఇంద్రాణికి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ విశ్వరంజన్ సేన్ గుప్తా భార్య, ఆయన కుమారుడు పశ్చిమ బెంగాల్ హై కోర్టును ఆశ్రయించారు. తన భార్య, కుమారుడు సరిగ్గా చూడలేదని విశ్వరంజన్ సేన్ గుప్తా తన వీలునామాలో రాశారు.

Supreme Court says, Father can give property to married daughter

నా చివరి రోజుల్లో తన కుమార్తె ఇంద్రాణి దగ్గరే ఉన్నానని, అందుకే తన ఆస్తిని తన కుమార్తె పేరు మీద రాస్తున్నానని గుప్తా వీలునామాలో రాశారు. సొసైటి యాజమాన్యం గుప్తా ఆస్తిని ఆయన కుమార్తె ఇంద్రాణి పేరు మీద రిజిస్టర్ చేయించారు.

ఈ విషయంలో గుప్తా భార్య, ఆయన కుమారుడు పశ్చిమ బెంగాల్ హై కోర్టు నుఆశ్రయించారు. గుప్తా ఆస్తిని ఆయన కుమార్తె ఇంద్రాణి పేరు మీద రిజిస్టర్ చేయించాలని హై కోర్టు సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. దీనిపై ఇంద్రాణి తల్లి హై కోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీలు చేసుకున్నారు.

కేసు విచారణ చేసిన హై కోర్టు డివిజన్ బెంచ్ గుప్తా ఆస్తికి ఇంద్రాణి ఒక్కరే వారసురాలుకాదని, ఆమె అందులో ఒక భాగం మాత్రం అంటూ తీర్పు చెప్పింది. డివిజన్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ ఇంద్రాణి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

కేసు వివరాలు మొత్తం పరిశీలించిన జస్టిస్ జేఎస్ ఖేకర్, జస్టిస్ సి. నాగప్పన్ తో కూడిన ధర్మాసనం ఇరు వర్గాల వాదనలు విన్నారు. చివరికి తన తుది తీర్పు వెలువరించింది.సహకార సంఘంలో సభ్యుడు తనకు కావల్సినవాళ్లను నామినేట్ చేసుకునే హక్కు ఉందని, ఆ సభ్యుడు మరణించిన తరువాత సొసైటి సదరు నామినీ ప్రయోజనాలను తప్పనిసరిగా కాపాడల్సి ఉందని ధర్మాసనం తన తుది తీర్పులో స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+