రేప్ కేసులలో రాజీ చెల్లదు: సుప్రీం సంచలన తీర్పు
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో నిందితులకు, బాధితులకు మధ్య ఎలా రాజీ చేస్తారు అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. బుధవారం సుప్రీం కోర్టులో రేప్ కేసులలో రాజీ విషయంపై విచారణ జరిగింది. ఈ సందర్బంలో సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలనమైన వ్యాఖ్యలు చేసింది.
రేప్ కేసులలో రాజీలు, ఒప్పందాలు చెల్లవని స్పష్టం చేసింది. అత్యాచార కేసుల విషయంలో రాజీ చేస్తే మహిళల గౌరవానికి భంగం కలుగుతుందని, వారి హక్కులను హరించినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇటీవల తమిళనాడులోని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి దేవదాస్ అత్యాచారం కేసులో రాజీ చేసుకోవాలని ఆదేశించడాన్ని తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. నేరం చేసిన నిందితులకు కఠినమైన శిక్షలు అమలు చెయ్యాలని, వారి పట్ల మెతకవైఖరి చూపించరాదని సూచించింది.

రేప్ కేసులలో నిందితులు, బాధితులు రాజీ చేసుకున్నా అది చెల్లదని స్పష్టం చేసింది. రాజీ చేసుకుంటామని వారు ప్రతిపాదిస్తే దాన్నీ తీవ్ర నేరంగా పరిగణించాలని ఆదేశాలు జారీ చేసింది. మహిళల గౌరవానికి భంగం కలిగించడం తీవ్రమైన తప్పిదమని సుప్రీం కోర్టు గుర్తు చేసింది.
కొన్ని రోజుల క్రితం మద్రాసు హై కోర్టు న్యాయమూర్తి దేవదాస్ ఒక రేప్ కేసులో జైల్లో ఉన్న నిందితుడికి, బాధితురాలికి రాజీ కావాలని సూచించారు. అందుకు వీలుగా నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. నిందితుడిని వివాహం చేసుకోవాలని న్యాయమూర్తి బాధితురాలికి సూచించడం వివాదానికి దారి తీసింది.












Click it and Unblock the Notifications