ముస్లింలపై విద్వేష ప్రసంగాలు : కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ముస్లిం విద్వేష ప్రసంగాలపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ రెండు రోజుల క్రితం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సీరియస్ అయింది. విద్వేష ప్రసంగాలను ఆపేందుకు చర్యలు తీసుకుంటారా లేక తమనే కోర్టు ధిక్కార చర్యలు తీసుకోమంటారా అని కేంద్ర, రాష్ట్రాల్ని ప్రశ్నించింది.

ఇది 21వ శతాబ్దమని, మతం పేరుతో మనం ఎక్కడికి చేరుకున్నామని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ద్వేషపూరిత ప్రసంగాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించి, అలాంటి ఘటనలకు వ్యతిరేకంగా అధికారులు స్వయంగా చర్యలు తీసుకోవాలని లేదా ధిక్కార ఆరోపణలను ఎదుర్కోవాలని కోర్టు ఆదేశించింది. అధికారులు చర్య తీసుకోకపోతే ధిక్కార చర్యలు ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. మతరహితంగా ఉండాల్సిన దేశంలో పరిస్ధితులు దిగ్భాంతికరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

supreme court serious warning to centre, states on control of hate speeches

దేశంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేస్తున్న ముప్పును ఆపేందుకు తక్షణ జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కేంద్రం, రాష్ట్రాల స్పందన కోరింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్వేషపూరిత నేరాలు, ద్వేషపూరిత ప్రసంగాల ఘటనలపై విశ్వసనీయమైన విచారణలు ప్రారంభించేలా కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించాలని పిటిషనర్ షాహీన్ అబ్దుల్లా సుప్రీంకోర్టును కోరారు.

పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఇటీవలి "హిందూ సభ" ఘటనను ఉదహరించారు. పశ్చిమ ఢిల్లీకి చెందిన బిజెపి ఎంంపీ పర్వేష్ వర్మ ముస్లింలు దేశం నుంచి పూర్తిగా బహిష్కరించాలని ఇచ్చిన పిలుపును గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మరో వక్త జగత్ గురు యోగేశ్వర్ ఆచార్య చేసిన వ్యాఖ్యలను కూడా న్యాయమూర్తులు చదివి వినిపించారు. మా దేవాలయాలలో వేలు ఎత్తే ఎవరైనా గొంతు కోయండి అని హాజరైన వారిని వారు కోరారు. పోలీసులు, ప్రభుత్వాలు తమంతట తాముగా కేసులు పెట్టుకోవాలని కఠినంగా ఆదేశించినందుకు సిబల్‌కి ధన్యవాదాలు తెలిపిన న్యాయమూర్తులు.. ఇది మా కర్తవ్యం.. మనం చేయకుంటే అది మన పక్షాన పదవీ విరమణ చేసినట్లే అన్నారు.

దీనిపై దాఖలు చేసిన పిటిషన్‌లో పిటిషనర్ అబ్దుల్లా ద్వేషపూరిత నేరాలు, ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టడానికి చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, ఇతర కఠినమైన నిబంధనలను అమలు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేయడంలో అధికార రాజకీయ పార్టీ సభ్యులు పాల్గొనడం ద్వారా ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+