వైసీపీ సహా ఆ పార్టీలకు సుప్రీం షాక్: సీజేఐ ఎన్వీ రమణ బెంచ్ కీలక సూచనలు: డెడ్‌లైన్

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవ్వాళ కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన సూచనలు చేసింది. ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలతో ముడిపడి ఉన్నవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా అన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఎన్నికల హామీలకు సంబంధించినది కావడం వల్ల- ఈ సూచనలను కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంత మేర అమలు చేస్తుందనే ఆసక్తికరం.

 ఎన్నికల ప్రచార హామీలపై..

ఎన్నికల ప్రచార హామీలపై..

ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ.. ఇలా అన్ని పార్టీలు కూడా హామీల మీద హామీలు ఇస్తుంటాయి. ఉచిత పథకాలను తెరమీదకి తీసుకొస్తుంటాయి. ప్రజల ఆలోచన ధోరణిని మార్చివేసేలా ఉచిత పథకాలపై ప్రచారాలను నిర్వహిస్తుంటాయా పార్టీలన్నీ. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని ఎంత వరకు అమలు చేస్తాయనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకూ వాటి ఊసే ఎత్తని పార్టీల సంఖ్యే ఎక్కువగా ఉంది.

 ఓటర్లను ప్రభావితం చేస్తాయ్..

ఓటర్లను ప్రభావితం చేస్తాయ్..

ఓటర్లను ప్రభావితం చేసే ఉచిత పథకాల హామీలపై పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్రానికి సూచనలు చేసింది. నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అధికార- ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధులతో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఉచిత హామీలనేవి తీవ్రమైన ఆర్థిక అంశాలకు సంబంధించినదిగా వ్యాఖ్యానించింది.

ఉచితాలు అవసరమా?

ఉచితాలు అవసరమా?

అసలు ఉచిత పథకాలు ఎందుకు?, ఎంతవరకు అమలవుతాయి?, వాటిని నియంత్రించడం ఎలా? అనే వాటిపై విధి విధానాలను రూపొందించాలని సూచించింది. ఎన్నికల్లో ఆయా పార్టీలు ఇచ్చే ఉచితాలపై దాఖలైన పిటీషన్‌ను ఇదివరకే సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇవ్వాళ మరో విడత విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమ కోహ్లీతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది.

భారం ఎంత?

భారం ఎంత?

ఈ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాలను ఎవరు కోరుకుంటోన్నారు? ఎవరు వ్యతిరేకిస్తోన్నారు?.. వాటి వల్ల పడే ఆర్థిక భారం ఎంత? అనే విషయాలపై ఆరా తీయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉచితాలను నియంత్రించడానికి చేపట్టాల్సిన చర్యలు, వాటిని పర్యవేక్షించడానికి ఏర్పాటు చేయదలిచిన అత్యున్నత స్థాయి కమిటీ కూర్పుపై వారం రోజుల్లోగా సూచనలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం, సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్, పిటీషన్లకు ఈ బెంచ్ ఆదేశించింది.

కేంద్రం వ్యతిరేకం..

కేంద్రం వ్యతిరేకం..

ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. కేంద్ర ప్రభుత్వం.. ఉచితాలకు వ్యతిరేకమని తేల్చి చెప్పారు. ఉచితాలకు వ్యతిరేకంగా దాఖలైన ఈ పిటీషన్లకు కేంద్రంగా అనుకూలంగా ఉందని చెప్పారు. ఓటర్లను ప్రభావితం చేయదగ్గ ఉచిత హామీలు ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా పరిణమిస్తాయని వ్యాఖ్యానించారు. ఆర్థిక విధ్వంసానికి కారణమౌతాయని పేర్కొన్నారు. కేంద్రం అందుకు సమ్మతించదని చెప్పారు.

అన్నీ లబ్ది పొందుతున్నవే..

అన్నీ లబ్ది పొందుతున్నవే..

దీనిపై సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ- ఒక్క పార్టీ అని కాకుండా అన్నీ కూడా ఉచిత పథకాల హామీలతో లబ్ది పొందుతున్నాయని చెప్పారు. ఏదో ఒక పార్టీ పేరు తాను చెప్పలేనని అన్నారు. ప్రభుత్వానికి తాము చెల్లించిన పన్నులు అభివృద్ధి పనుల కోసం వినియోగించాల్సి ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తారని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఉచిత హామీల గురించి లబ్ది పొందుతున్నవేనని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+