టి: పిటిషన్లు స్వీకరించిన సుప్రీం, ఈ సెషన్‌లోనే: ఆజాద్

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దాఖలైన తొమ్మిది పిటిషన్‌లను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. న్యాయస్థానం అన్ని పిటిషన్ల పైన ఒకేసారి విచారణ చేపట్టనుంది. జస్టిస్ దత్తు, జస్టిస్ బోబ్డేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వీటిని విచారిస్తోంది.

విభజనను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్, రఘురామ కృష్ణం రాజు తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు. రఘురామ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. దీంతో ఆయన ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

 Supreme Court

నిన్నటిదే చివరి సమావేశం: ఆజాద్

గురువారం నాడు జరిగినదే చివరి మంత్రుల బృందం (జివోఎం) సమావేశమని కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ శుక్రవారం అన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అన్ని పార్టీలు సహకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సభను అడ్డుకోవద్దు: కమల్ నాథ్

తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు సభను అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దని కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఇరు ప్రాంతాల సభ్యులు ఇకనైనా సభను అడ్డుకోవద్దని కోరారు. బిల్లుపై ఓటింగు ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+