వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీం కోర్టు ఆదేశం: కావేరీ జలాలపై కర్నాటకకు షాక్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమిళనాడుకు ప్రతి రోజు ఆరు వేల క్యూసెక్కుల కావేరీ జలాలు విడుదల చెయ్యాలని కర్ణాటకకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కావేరీ జలాలను ఈనెల 30వ తేది వరకు తమిళనాడుకు విడదల చేయాల్సిందే అని మంగళవారం సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.

దీనిపై తదుపరి విచారణ ఈనెల 30వ తేదికి వాయిదా వేసింది. కావేరీ నదిలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున నీటి విడుదల తీర్పును మళ్లీ పరిశీలించాలని కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Supreme Court tells Karnataka to release 6,000 cusecs for two days

మంగళవారం సుప్రీం కోర్టు పిటిషన్ విచారించింది. కావేరీ నీరు చాల తక్కువగా ఉందని, ఆ నీరు తాగునీటి అవసరాలకు ఉపయోగించుకుంటామని కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది నారిమన్ కోర్టులో మనవి చేశారు.

అదనంగా ఇవ్వాల్సిన 42 వేల క్యూసెక్కుల నీటిని డిసెంబర్ లో తమిళనాడుకు విడుదల చేస్తామని ఆయన మనవి చేశారు. అయితే నీటిని విడుదల చేసే వరకు కర్ణాటక వాదనను పట్టించుకోరాదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును కొరింది.

Supreme Court tells Karnataka to release 6,000 cusecs for two days

ప్రధాని నరేంద్ర మోడీతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సమావేశం అయ్యి చర్చించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది.

సుప్రీం కోర్టు తీర్పుతో కర్ణాటక ప్రభుత్వం అయోమయంలో పడింది. ఎలాగైనా సుప్రీం కోర్టులో తనవాదనలు వినిపించాలని కర్ణాటక ప్రయత్నించింది. చివరికి 18,000 క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చెయ్యడంతో ఇప్పుడు ఏమి చెయ్యాలని అని కర్ణాటక ప్రభుత్వం ఆలోచనలోపడింది.

English summary
SC warns that disobedience is no solution in a federal structure. Show bonafide and release 6,000 cusecs of water for two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X