సీజేఐపై కుట్ర విచారణకు సుప్రీం కమిటీ
ఢిల్లీ : సీజేఐ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సుప్రీంకోర్టు సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంలో కుట్ర కోణంపై విచారణ జరిపేందుకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. సీబీఐ, ఐబీ విభాగం డైరెక్టర్లతో పాటు ఢిల్లీ పోలీసు కమిషనర్‌లు విచారణకు సహకరించాలని సూచించింది.

సీజేఐపై కుట్ర పన్నుతున్నారని అడ్వకేట్ ఉత్సవ్ బైన్స్ దాఖలు చేసిన అఫిడవిట్‌పై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ అవసరమని అభిప్రాయపడింది. జస్టిస్ పట్నాయక్ ఇన్ హౌజ్ విచారణలో జోక్యం చేసుకోరని కోర్టు స్పష్టం చేసింది. విచారణ అనంతరం ఆయన సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications