'రామ జన్మభూమిలో రామాలయం': కీలక నేతగా యోగి ఆదిత్యనాథ్

Posted By:
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్/లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమక్షంలోనే అయోధ్యకు చెందిన దిగంబర్‌ అఖాడా మహంత్‌ సురేశ్ దాస్‌ వివాదాస్పద అంశాన్ని ప్రస్తావించారు. రామజన్మ భూమిలోనే రామాలయం నిర్మితమవుతుంద అన్నారు.

మీరు వద్దు: బీజేపీ కేడర్‌కు యోగి ఆదిత్యనాథ్ ఝలక్

యోగి ఆదిత్యనాథ్‌ హాజరైన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నందున ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందన్నారు.

2018 నాటికి రాజ్యసభలో బీజేపీకి ఆధిక్యం లభిస్తుందని, చట్టాలు చేయడానికి ఇబ్బందులుండవన్నారు. అప్పటికీ ముస్లింలు చర్చలకు సుముఖత చూపించి, రామాలయ నిర్మాణానికి వారు మద్దతు పలికితే స్వాగతిస్తామని చెప్పారు.

కీలక నేతగా ఎదుగుతున్న యోగి

కీలక నేతగా ఎదుగుతున్న యోగి

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నేతగా ఎదుగుతున్నారు. పాలనలో ఆయన తన మార్క్ చూపిస్తున్నారు. యోగీ యూపీ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.

పార్టీకి ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత అంతటి స్థాయి స్టార్ క్యాంపెయినర్‌గా పుట్టుకు వస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకమైనవి. ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారానికి కమలం పార్టీ సిద్ధమవుతోంది.

150 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే పలు సంచనల నిర్ణయాలు తీసుకుంటూ జనాల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు యోగి ఆధిత్యనాథ్.

విస్తృత ప్రచారం

విస్తృత ప్రచారం

యూపీ ఎన్నికల సమయంలో కూడా ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలతో పాటు యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రచారం చేస్తారని ఆ పార్టీ శ్రేణుల నుంచి సమాచారం అందుతోంది.

గుజరాత్ రూపంలో యోగి ఆదిత్యనాథ్‌ మరో బృహత్తర బాధ్యతను తీసుకోబోతున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ, అమిత్ షాలతో పాటు యోగిని కీలక ప్రచారకర్తగా రంగంలోకి దింపాలని భావిస్తోంది.

వీరిద్దరికి అగ్ని పరీక్ష

వీరిద్దరికి అగ్ని పరీక్ష

గుజరాత్ రాష్ట్ర అధ్యక్షులు జితు వాఘని ఆదివారం బీజేపీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల చీఫ్‌లతో పాటు సౌరాష్ట్ర, రాజ్‌కోట్‌ జిల్లాల ప్రతినిధులతో జరిపిన సమావేశంలో పార్టీని విజయతీరాలకు తేర్చే వ్యూహంపై చర్చించారు. ఆసక్తికరంగా వాఘాని భావ్‌నగర్‌కు చెందిన వ్యక్తి కాగా, ముఖ్యమంత్రి రూపాని రాజ్‌కోట్‌కు చెందిన వారు. దీంతో ఈ ఇద్దరు నేతలకూ రాబోయే ఎన్నికలు అగ్ని పరీక్షనే.

స్టార్ కంపెయినర్

స్టార్ కంపెయినర్

సౌరాష్ట్ర, కచ్‌లలో 53 అసెంబ్లీ సీట్లు ఉండగా, 35 స్థానాలు బీజేపీవే. ఇప్పుడు కనీసం 40కి పైగా సీట్లు గెలవాలని బీజేపీ టార్గెట్‌గా ఉంది. అలాగే మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో 150 సీట్లు గెలుపును లక్ష్యంగా పార్టీ నిర్దేశించుకుంది. ఇందుకోసం పార్టీ హేమాహేమీలు ప్రచారబరిలోకి దిగనున్నారు.

క్యాంపెయినర్‌గా ఆదిత్యనాథ్‌ను కూడా బరిలోకి దింపాలని పార్టీ భావిస్తున్నట్టు వాఘాని తెలిపారు. గుజరాత్‌లో ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై అడిగినప్పుడు, సరైన సమయంలోనే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తు ఎన్నికల ఆలోచనైతే లేదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
suresh das says ram temple will be build in Ayodhya.
Please Wait while comments are loading...