పింఛన్ దరఖాస్తుదారుల్లో రైనా, మహ్మద్ కైఫ్!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పింఛన్ కోసం దరఖాస్తు చేసినవారిలో క్రికెటర్లు సురేశ్ రైనా, మహ్మద్ కైఫ్, రాజకీయ రంగంలో ఉన్న నటుడు రాజ్‌బబ్బర్ తదితరులు ఉన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి కూడా పింఛన్లు కల్పించడం, వారు దరఖాస్తు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజాధనాన్ని ఇలాంటివారిపై ఏకపక్షంగా ఖర్చు చేయడం తగదని ప్రతిపక్షాలు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ యశ్‌భారతి పురస్కారాన్ని దక్కించుకున్నవారికి నెలకు రూ.50,000 చొప్పున పింఛన్‌గా చెల్లిస్తామని గత అక్టోబరులో ప్రభుత్వం ప్రకటించింది.

ఈ పురస్కారాలు పొందిన 141 మందిలో 108 మంది నిర్ణీత గడువులోగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ వర్గాలు తెలిపాయి.
సురేష్ రైనా, రాజ్‌బబ్బర్, కైఫ్, రాజ్ బబ్బర్, అతని భార్య నదిరా బబ్బర్, గాయకులు సుభా ముద్గల్, కైలాష్ ఖేర్ వంటివారూ దరఖాస్తు చేసుకోవడంపై భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అభ్యంతరం తెలిపాయి. పింఛన్‌ను తిరస్కరించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ను ఇతరులూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించాయి.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications