వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్జికల్ స్ట్రయిక్: 'మోడీకి ములాయం ఇచ్చిన సలహా'

|
Google Oneindia TeluguNews

లక్నో: యూరి ఉగ్రదాడికి ప్రతిగా భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోకి వెళ్లి సర్జికల్ స్ట్రయిక్ దాడి చేసింది. ఈ దాడులతో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ క్రేజీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో సమాజ్ వాది పార్టీ తాజాగా ఏర్పాటు చేసిన హోర్డింగులు ఆసక్తిని రేపుతున్నాయి.

ఎల్వోసీ వెంబడి ఉగ్రవాద శిబిరాల పైన భారత్‌ సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్ దాడి ప్రపంచమంతా పొగుడుతోంది. దీనికి మన రాజకీయ నాయకులు మాత్రం రాజకీయ రంగు పులుముతున్నారు. ఇప్పటికే సర్జికల్ స్ట్రయిక్ వీడియోలు బయటపెట్టమని కొందరు నేతలు డిమాండ్ చేశారు. దీనిపై చాలామంది విమర్శలు గుప్పించారు.

mulayam singh yadav

ఇప్పుడు, సమాజ్ వాది పార్టీ సర్జికల్ స్ట్రయిక్ దాడి పైన తమ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సలహా ఇచ్చారని హోర్డింగులు ఏర్పాటు చేయటం గమనార్హం. ఇటీవల యూపీలో బీజేపీ నేతలు సర్జికల్ దాడులకు సంబంధించి హోర్డింగ్స్‌ ఏర్పాటు చేశారు.

అయితే దానిని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఈ నేపథ్యంలోనే ముజ్‌ఫర్‌నగర్‌లో కొత్తగా ఒక పోస్టర్‌ వెలిసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఎస్పీ చీఫ్‌ ములాయంసింగ్‌ యాదవ్‌ను సర్జికల్ స్ట్రయిక్ దాడులకు సంబంధించి సంప్రదించారని.. ములాయం అంగీకరించడంతో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో లక్షిత దాడులు చేశారని ఆ పోస్టర్‌లో ఉంది. ఆ పోస్టర్‌ను తామే ఏర్పాటు చేసినట్లు సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌ షంషేర్‌ మాలిక్‌ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు.

English summary
After BJP hoardings threatening to "hit" Pakistan in their own territory+ came up in communally sensitive Muzaffarnagar, a local Samajwadi Party leader has also put up a hoarding claiming that Prime Minister Narendra Modi ordered the surgical strike only after consulting with SP chief Mulayam Singh Yadav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X