రూ.20 లక్షల కోట్లకు మోడీ చెక్: పాక్ నుంచి భారత్‌కు ఫేక్ కరెన్సీ ఇలా..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్ల రద్దు చేయడం ద్వారా రూ.20,00,000 కోట్ల ఫేక్ కరెన్సీని చెక్ పెట్టారు. పాకిస్తాన్ దాదాపు రూ.12,00,000 కోట్ల ఫేక్ కరెన్సీని భారత్‌లో చలామణిలోకి తెచ్చినట్లగా భావిస్తున్నారు.
ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా ఫేక్ కరెన్సీని పెద్ద మొత్తంలో అందుబాటులోకి తీసుకు వస్తోంది. పాక్‌కు చెందిన ఐఎస్ఐ స్పాన్సర్ చేసే ఓ పాకిస్తాన్ ఫేక్ కరెన్సీ రాకెట్ ప్రధానంగా రూ.500, రూ.1000 నోట్ల పైన దృష్టి సారించింది. సీబీఐ చేసిన ఓ విచారణలో.. ఐఎస్ఐ దొంగలు టెంప్లేట్స్ దొంగిలించి ఈ నోట్లు తయారు చేశారని తెలుస్తోంది.
గత కొన్నేళ్లుగా ఐఎస్ఐ భారత కరెన్సీకి నకలుగా ఫేక్ కరెన్సీని తయారు చేస్తోంది. దీంతో అసలు నోటు ఏదో, ఫేక్ నోటు ఏదో తెలియని పరిస్థితి కూడా ఏర్పడింది.

కేవలం టెంప్లేట్స్ దొంగిలించడమే కాదు. భారత ప్రభుత్వం ఎక్కడి నుంచి అయితే పేపర్ తీసుకువస్తుందో అలాంటి పేపర్‌ను పొందడం ప్రారంభించారు.
గతంలో వారు పాకిస్తాన్‌లోనే కలప గుచ్చుతో ఫేక్ కరెన్సీ తయారు చేసేవారు. ఆ తర్వాత పేపర్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. విదేశాల నుంచి అచ్చం మన పేపర్ లాంటి దానినే తీసుకువచ్చారు.
ఐబీ రిపోర్ట్స్ మేరకు.. భారత కరెన్సీకి ఉపయోగించే లాంటి పేపర్‌ను దిగుమతి చేసుకునేందుకు ఐఎస్ఐ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఒప్పించిందని తెలుస్తోంది. దీనినే ఫేక్ కరెన్సీ తయారీకి ఉపయోగిస్తుంది.
క్వెట్టా, లాహోర్, పెషావర్ తదితర పాకిస్తాన్ ప్రభుత్వ ప్రెస్‌లలో ఈ ఫేక్ కరెన్సీ తయారు అవుతోందని పలువురు పాక్ ప్రభుత్వ అధికారులకు కూడా తెలుసునని ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించిందని తెలుస్తోంది.
ఒకసారి పెద్ద మొత్తంలో నోట్లను ప్రింట్ చేస్తుంది. వాటిని అక్కడి నుంచి నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలకు ట్రాన్సుపోర్ట్ చేస్తుంది. అక్కడి నుంచి ఏజెంట్ల చేతిలోకి వెళ్తుంది. 2:1 ఒప్పందంతో ఏజెంట్లు భారత్‌లోకి తీసుకు వస్తారు. ఒక అసలైన రూపాయికి రూ.2 ఫేక్ రూపాయలను ఇస్తారు.
ఐఎస్ఐ టెంప్లేట్ దొంగిలించకముందు.. ఇబ్బందులు పడింది. ఆ తర్వాత టెంప్లేట్ తమ చేతికి వచ్చాక సమస్య తీరిపోయింది.












Click it and Unblock the Notifications