Surya Grahan 2021: శని జయంతి, జ్యేష్ఠ అమావాస్య, తొలి గ్రహణం...ఈ రాశులవారు జరభద్రం
న్యూఢిల్లీ: ఇంకొన్ని గంటల్లో ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సంవత్సరంలో ఇదే తొలి సూర్యగ్రహణ కాలం. అన్నింటికీ మించి- శని దేవుడి జయంతి రోజే సూర్యగ్రహణం ఏర్పడనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం.. దీన్ని అశుభంగా పరిగణిస్తోన్నారు పండితులు. జ్యేష్ఠ మాసం కృష్ణపక్షపు అమావాస్య రోజు నాడు సూర్యగ్రహణం ఏర్పడటం అతి అరుదుగా సంభవిస్తుంటుందని చెబుతున్నారు. ఎన్నో ఏళ్ల తరువాత గానీ ఇలాంటి అరుదైన కూటమి సంభవించదని అంటున్నారు.

అయిదు గంటల పాటు..
సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉన్న సమయంలో సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. ఈ అంతరిక్ష అద్భుతం పలు దేశాల్లో కనిపిస్తుంది. పాక్షికమే అయినప్పటికీ..కొన్ని దేశాలు రింగ్ ఆఫ్ ఫైర్‌ను చూడగలుగుతాయి. భారత్‌లో ఈ సూర్యగ్రహణం మధ్యహ్నం ఒంటిగంటా 42 నిమిషాలకు ఆరంభమౌతుంది. సాయంత్రం 6:41 నిమిషాలకు ముగుస్తుంది. గ్రహణం సమయం ఆరంభం నుంచి పూర్తి ఆ ఛాయ తొలగిపోవడానికి దాదాపు ఆరు గంటల పాటు పడుతుంది.

లైవ్ స్ట్రీమింగ్..
టైమ్ అండ్ డేట్ అనే వెబ్‌సైట్ వేసిన అంచనాల ప్రకారం.. భారత్‌లో ఇది కనిపించదు. రష్యా, గ్రీన్‌ల్యాండ్, కెనడా ఉత్తర ప్రాంతంలల్లో పాక్షికంగా కనిపిస్తుంది. ఆసియా ఉత్తర ప్రాంత దేశాలు, ఆఫ్రికా పశ్చిమ ప్రాంత దేశాలు, అట్లాంటిక్, ఆర్కిటిక్, యూరప్, అమెరికా దేశాల్లోనూ పాక్షికంగా దర్శనమిస్తుందీ సూర్యగ్రహణం. భారత్‌లో ఇది కనిపించే వీలు ఏమాత్రం లేదు. అయినప్పటికీ- టైమ్ అండ్ డేట్ డాట్ కామ్ సంస్థ దాన్ని ప్రత్యక్షంగా చూసే వీలు కల్పించింది. సూర్యగ్రహణానికి సంబంధించిన లైవ్ స్ట్రీమ్‌ను ప్రసారం చేయనుంది. సూర్యగ్రహణం ప్రారంభ సమయం నుంచి పూర్తిగా ముగిసిపోయేంత వరకూ ఈ లైవ్ స్ట్రీమ్ కొనసాగుతుందని ఆ సంస్థ వెల్లడించింది.

రింగ్ ఆఫ్ ఫైర్..
పాక్షిక సూర్యగ్రహణం కావడం వల్ల భూమి ఛాయ సూర్యడి మీదుగా ప్రయాణించినప్పుడు దాన్ని పూర్తిగా కప్పేయదు. ఫలితంగా రింగ్ ఆఫ్ ఫైర్ ఏర్పడుతుంది. చుట్టూ భగభగ మండే అంచులు. మధ్య గ్రహణ ఛాయతో సూర్యుడు కనిపిస్తాడు. కాగా.. సూర్యగ్రహణం ఉచ్ఛస్థితికి చేరినప్పుడు ఏర్పడే రింగ్ ఆఫ్ ఫైర్‌ను గ్రీన్‌ల్యాండ్‌లో సంపూర్ణంగా కనిపిస్తుంది. గ్రీన్‌ల్యాండ్, సెర్బియాతో పాటు ఉత్తర ధృవానికి అంచున ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా రింగ్ ఆఫ్ ఫైర్ చూడగలుగుతారని టైమ్ అండ్ డేట్ పేర్కొంది. ఈస్ట్‌కోస్ట్, అప్పర్ మిడ్‌వెస్ట్ దేశాల ప్రజలు పాక్షికంగా ఈ అద్భుతాన్ని చూడొచ్చు.

ఏఏ రాశులపై ప్రభావం..
శని జయంతి, జ్యేష్ఠ అమావాస్య, ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం.. ఇలా ఒకేసారి కలిసి రావడం చాలా అరుదుగా సంభవిస్తుంటుందని, ఎన్నో సంవత్సరాల తరువాత ఇలాంటి కూటమి ఏర్పడిందని పండితులు చెబుతున్నారు. నాలుగు రాశులపై గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తోన్నారు. ప్రత్యేకించి- వృషభ (Taurus) రాశిపై దీని దుష్ప్రభావం అధికంగా ఉంటుందని పండితులు విశ్లేషిస్తోన్నారు. గ్రహణ ప్రభావంతోో వారికి అనారోగ్యం సంభవించే అవకాశం ఉందని, ధన నష్టం కలుగుతుందని జోస్యం చెబుతోన్నారు.

మరో మూడింటిపైనా
మిథునం (Gemini), తుల (Libra), మకర (Capricorn) రాశుల వారికీ కొంత ఇబ్బదికర పరిస్థితులు ఏర్పడటానికి ఈ గ్రహణం కారణమౌతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారు ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు మరింత శ్రమపడాల్సి ఉంటుందని పండితులు అంచనా వేస్తోన్నారు. తుల రాశి వారు మానసికంగా అశాంతికి గురవుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోందని పండితులు స్పష్టం చేస్తున్నారు. గ్రహణ కాలంలో మకరరాశి వారు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని హెచ్చరిస్తోన్నారు. దీనికి విరుద్ధంగా వెళ్తే తుది ఫలితాలు నిరాశాజనకంగా ఉంటాయని హితబోధ చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications