40 రోజులు 60 మంది అమ్మాయిపై రేప్: 18 ఏళ్ల తర్వాత

అమ్మాయిని అపహరించి, అత్యాచారం చేసిన ముఠాకు నాయకత్వం వహించిన వ్యక్తికి కేరళ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. హోటళ్లు, ఇళ్లు, కార్లు - ఎక్కడపడితే అక్కడ ఆ అమ్మాయిపై 60 సార్లు అత్యాచారం చేశారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడినవారిలో పదవీ విరమణ చేసిన ఆచార్యులు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు ఉన్నారు.
తొమ్మిదేళ్ల క్రితం ఈ కేసులో కోర్టుకు చెందిన మరో బెంచ్ 24 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీంతో కేసును తిరిగి విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 31వ తేదీన తిరిగి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
సూర్యనెల్లి రేప్ కేసుగా పిలిచే ఈ కేసులో కెటి శంకరన్, జస్టిస్ ఎంఎల్ జోసెఫ్ ఫ్రాన్సిస్‌లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం తన తీర్పును వెలువరించింది. 1996 జనవరి 16వ తేదీన ప్రేమించాననే పేరుతో కేరళలోని ఇదుక్కి జిల్లా సూర్యనెల్లి పాఠశాల వసతి గృహం నుంచి రాజు అనే బస్సు కండక్టర్ ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లాడు. ఈ కేసులో అతను ప్రథమ ముద్దాయి. అతని నుంచి ఆ అమ్మాయి ఒకరి నుంచి ఒకరికి చేతులు మారుతూ వచ్చింది.












Click it and Unblock the Notifications