దొంగల లిస్టులో మోడీ..! రాహుల్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా

పాట్నా : లోక్‌సభ ఎన్నికల వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య పచ్చగడి వేసినా భగ్గుమనేలా తయారైంది పరిస్థితి. ఢిల్లీ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఇరు పార్టీల లీడర్లు నువ్వెంతంటే నువ్వెంత అంటున్నారు. ఆ క్రమంలో ఈ నెల 13వ తేదీన మహారాష్ట్రలో జరిగిన ర్యాలీ సందర్భంగా.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. దొంగల పేర్లున్న జాబితాలో మోడీ పేరు ఎందుకుందని రాహుల్ వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది.

Sushil Kumar Modi Filed a Criminal Defamation Case Against Rahul Gandhi

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ ఓ అడుగు ముందుకేసి పరువు నష్టం దావా వేశారు. మోడీ పేరున్నవారిని రాహుల్ కించపరిచారని ఆరోపిస్తూ.. పాట్నా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎదుట కేసు ఫైల్ చేశారు.

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని సుశీల్ కుమార్ మోడీ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈనెల 22వ తేదీన ఈ పిటిషన్ విచారణకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+