రాహుల్ మీ చరిత్ర చదువుకో!: బోఫోర్స్ నుంచి దుమ్ముదులిపిన సుష్మ

న్యూఢిల్లీ: లలిత్ గేట్ అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ బుధవారం నాడు లోకసభలో కాంగ్రెస్ పార్టీ దుమ్ము దులిపారు. తాను మానవతా దృక్పథంతోనే లలిత్ మోడీకి సాయం చేశానని, తాను దొంగచాటుగా చేయలేదని చెప్పారు.

ఇష్టం ఉంటే వినొచ్చు లేదా వెళ్లిపోవచ్చు

లోకసభ ఉదయం అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమైంది. సభలో సుష్మకు సమాధానం చెప్పేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతి ఇచ్చారు. సుష్మ సమాధానం చెబుతుండగా.. కాంగ్రెస్ సభ్యులు పదేపదే అడ్డుకున్నారు. గందరగోళం మధ్య సుష్మ వివరణ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ నినాదాలు చేసింది. తాము ప్రధానికి సంధించిన ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలంది. ప్రధాని సభలోకి రావాలని నినదించింది. దీనిపై స్పందించిన స్పీకర్... సమాధానం వినేందుకు ఇష్టపడని వారు బయటకి వెళ్లిపోవచ్చని చెప్పారు. సుష్మ ఉద్వేగంతో వివరణ ఇచ్చారు. మధ్యలో నీళ్లు కూడా తాగారు.

Sushma mocks Rahul, tells him to ask Sonia - 'Mumma, papa ne Quattrocchi ko kyun chhoda?'

లలిత్ గేట్ అశంపై చర్చ జరగాలని తాను మొదటి నుంచి అనుకుంటున్నానని సుష్మ చెప్పారు. తన పైన ఆరోపణలు చేసిన వారు తాను చెప్పేది వినాలన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. నిబంధనలకు అనుగుణంగానే లలిత్ మోడీకి అనుమతివ్వాలని బ్రిటిష్ ప్రభుత్వానికి తాను చెప్పానని చెప్పారు.

మానవతా దృక్పథంతోనే లలిత్ మోడీ భార్యకు తాను సాయం చేశానని చెప్పారు. లలిత్ మోడీ కేసును తన కుటుంబ సభ్యులు వాదించడం లేదని స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి హోదాలో చిదంబరం చేసింది అధికార దుర్వినియోగం అన్నారు.

తాను దొంగచాటుగా ఏమీ చేయలేదన్నారు. తాను మొదటి నుంచి దీనిపై చర్చ జరగాలని కోరుకుంటున్నానని, విపక్షాలు మాత్రం అడ్డుకుంటున్నాయని చెప్పారు. తాను చేసింది అధికార దుర్వినియోగం కాదన్నారు.

రాహుల్ గాంధీకి సెలవులు తీసుకోవడం అంటే ఇష్టమని ఎద్దేవా చేశారు. క్విడ్ ప్రోకోకు పాల్పడింది రాజీవ్ గాంధీ ప్రభుత్వమని తాను కాదని ఘాటుగా స్పందించారు. క్విడ్ ప్రోకో కింద రాజీవ్ గాంధీ నాడు అండర్ సన్‌ను భారత్ నుంచి పంపించేశారన్నారు.

రాహుల్ గాంధీ! ఒక్కసారి సెలవులు తీసుకొని వెళ్లి మీ కుటుంబ చరిత్ర చదువుకో అని సూచించారు. లలిత్ మోడీకి రైట్ ఆఫ్ రెసిడెన్సీ ఎలా లభించిందని తమను అడగటం కాదని, ఆయనకు రైట్ ఆఫ్ రెసిడెన్సీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందన్నారు. తాను 38 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇప్పటి వరకు తన పైన ఎలాంటి ఆరోపణలు రాలేదన్నారు.

ఏ కోర్టూ లలిత్ మోడీ పరారీలో ఉన్నట్లు ప్రకటించలేదన్నారు. శారదా స్కాంలో ఆర్థిక మంత్రి చిదంబరం భార్య ఎలా వాదించారని నిలదీశారు. బోఫోర్స్ స్కాంలో ప్రధాన నిందితుడిని దేశం దాటించింది కాంగ్రెస్ పార్టీ కాదా అన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, నేరుగా సభకు వస్తున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+