వెంకయ్యకు రాఖీ కట్టిన సుష్మా: గిప్ట్ ఏంటంటే..!
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పలువురు ప్రముఖులు, నేతలు ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నివాసంలో నిర్వహించిన రాఖీ వేడుకల్లో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ కేంద్ర మంత్రి వెంకయ్యకు రాఖీ కట్టి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సుష్మకు వెంకయ్య పట్టుచీర బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకమత్యం కోసమే పూర్వీకులు రాఖీ పండుగను కనిపెట్టారన్నారు. సోదరికి సోదరుడు భద్రత కల్పించడం మన కర్తవ్యమని తెలిపారు. దేశం సుభిక్షంగా ఉండాలని, జనమంతా భారతీయ సంప్రదాయాలకు పెద్దపీట వేయాలని వెంకయ్య ఆకాంక్షించారు.
దేశంలోని సోదరీమణులందరికీ వెంకయ్య రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇంట్లో చిన్నారులతో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తనకు రాఖీ కట్టడానికి వచ్చిన చిన్నారులకు మిఠాయిలు పంచారు.
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని
అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతి రూపం రాఖీ పౌర్ణమి. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా శుభాకంక్షలు తెలిపారు.
रक्षाबंधन के अवसर पर देशवासियों को हार्दिक शुभकामनायें। Greetings on Rakshabandhan.
— Narendra Modi (@narendramodi) August 29, 2015 The thread of Rakhi binds sisters & brothers in an inseparable bond of love and trust #PresidentMukherjee
— President of India (@RashtrapatiBhvn) August 29, 2015 रक्षाबंधन की बधाई। सभी बहनों की सुरक्षा की दुआ करता हूँ। अपनी छोटी बहन से राखी बंधवाने हरिद्वार उसके घर जा रहा हूँ।
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 29, 2015 Greetings on the auspicious occasion of Raksha Bandhan.It symbolizes affection, commitment and happiness.May the festival bring joy to all.
— Office of RG (@OfficeOfRG) August 29, 2015 అన్నా చెల్లెళ్ల అనుబంధానికీ, అపూర్వమైన అనురాగానికీ, ప్రతి రూపంగా జరుపుకునే పండుగే రాఖీ పౌర్ణమి. సోదరుడు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలన్న కోరికతో అతని చేతికి రాఖీ కడుతుంది సోదరి. అందుకు ప్రతిగా ఆమెను జీవితాంతం భద్రంగా చూసుకునే బాధ్యతను స్వీకరిస్తాడు సోదరుడు.
శ్రావణ మాస పౌర్ణమిని రాఖీ పర్వదినంగా దేశవ్యాప్తంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. హిందువులు, సిక్కులు, జైనులు ఈ రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటారు.












Click it and Unblock the Notifications