పాకిస్థాన్‌లో పర్యటించనున్న సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం పాకిస్థాన్‌లో పర్యటించనున్నారని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు. న్యూఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇస్లామాబాద్ వెళ్లి చర్చలు జరిపి భారత్‌కి ఆమె తిరిగొచ్చాక ఓ ప్రకటన చేస్తారని రాజీవ్ చెప్పారు. పాక్‌లో జరగనున్న భద్రతా సదస్సును ముగించుకుని స్వదేశానికి ఆమె విచ్చేసిన తర్వాత పార్లమెంట్ ఉభయసభలలో ఈ విషయంపై చర్చిద్దామని తెలిపారు.

ఇస్లామాబాద్‌లో మంగళవారం జరగనున్న భద్రతా సదస్సుకు భారత ప్రతినిధిగా సుష్మా స్వరాజ్ హాజరుకానున్నారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భారత్, పాకిస్థాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఆదివారం సమావేశమైన విషయం అందరికీ విదితమే.
నిర్మాణాత్మకమైన సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని ఇరు దేశాల నేతలు ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications