Wife: భార్య మీద విపరీతమైన అనుమానం, ఇంటికి వెళ్లి ముగ్గురిని కొడవలితో నరికేసి ఆత్మహత్య, చివరికి ?

భార్య మీద అనుమానం పెంచుకున్న భర్త వీరతాగుబోతు అయ్యాడు. తన భార్య ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ తనకు ద్రోహం చేస్తోందని భర్త రగిలిపోయాడు. మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన భర్త కొడవలి తీసుకుని అతని భార్యను నరికేశాడు.

బెంగళూరు/హుబ్బళి: వివాహం చేసుకున్న దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టే వరకు భర్త అతని భార్యతో చాలా సంతోషంగా కాపురం చేశాడు. తరువాత భర్త మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. భార్య మీద అనుమానం పెంచుకున్న భర్త చివరికి వీరతాగుబోతు అయ్యాడు. తన భార్య ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ తనకు ద్రోహం చేస్తోందని భర్త రగిలిపోయాడు. మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన భర్త కొడవలి తీసుకుని అతని భార్యను నరికేశాడు. అడ్డుపడిన ఇద్దరు పిల్లలను నరికేశాడు. ముగ్గురి మీద కొడవలితో దాడి చేసిన కిరాతకుడు ఇంట్లో ఉరి వేసుకున్నాడు. తాగుబోతు దెబ్బకు ఇంట్లో ఇద్దరు శవాలైనారు.

10 ఏళ్ల క్రితం పెళ్లి

10 ఏళ్ల క్రితం పెళ్లి

కర్ణాటకలోని హుబ్బళి నగరం సమీపంలోని గ్రామంలో పకీరప్ప అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం పకీరప్ప ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పరీకప్ప దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలం నుంచి మద్యానికి బానిసైన పకీరప్ప మద్యం మత్తులో ఇంటికి వెళ్లాడు. తరువాత పకీరప్ప అతని భార్యతో గొడవపెట్టుకున్నాడు.

మద్యం మత్తులో భార్య, బిడ్డల మీద కొడవలితో దాడి

మద్యం మత్తులో భార్య, బిడ్డల మీద కొడవలితో దాడి

ఆ సందర్బంలో పరీరప్ప దంపతుల మధ్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన పకీరప్ప ఇంట్లో ఉన్న కొడవలి తీసుకుని అతని భార్యను ఇష్టం వచ్చినట్లు నరికేశాడు. తల్లి మీద దాడి చేస్తుండటంతో ఇద్దరు పిల్లలు తండ్రి పకీరప్పను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో కిరాతకుడు పకీరప్ప మద్యం మత్తులో బిడ్డల మీద అదే కొడవలితో దాడి చేశాడు.

ముగ్గురు చనిపోయారని ఆత్మహత్య

ముగ్గురు చనిపోయారని ఆత్మహత్య

తల్లీ బిడ్డలు ముగ్గురు రక్తపుమడుగులో కుప్పకూలిపోయారు. ముగ్గురు చనిపోయారు అనుకున్న పకీరప్ప అదే ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రగాయాలైన తల్లీ బిడ్డలను హుబ్బళిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై శ్రేయస్ (6) అనే అబ్బాయి ప్రాణం పోయిందని పోలీసులు అన్నారు.

భార్య మీద అనుమానంతో ?

భార్య మీద అనుమానంతో ?

భార్య మీద విపరీతంగా అనుమానం పెంచుకున్న పకీరప్ప అతని భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమెను చంపేయాలని ప్లాన్ వేశాడు. భార్య ను హత్య చెయ్యడానికి ప్రయత్నించి మద్యం మత్తులో బిడ్డల మీదకూడా కొడవలితో దాడి చేశాడని హుబ్బళి గ్రామీణ పోలీసులు అన్నారు. పకీరప్ప భార్య, మరో బిడ్డ పరిస్థితి చాలా విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో గొడవలు జరిగి ఒకే ఇంటిలో ఇద్దరు శవాలు కావడం, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+