ప్రణబ్ సతీమణి 'సువ్రా' గురించి తెలియని విషయాలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ న్యూఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సువ్రా ముఖర్జీ గురించి పాఠకులక ప్రత్యేకం:
* సువ్రా ముఖర్జీ బంగ్లాదేశ్‌లోని జెస్సోర్‌లో సెప్టెంబర్ 17, 1940 న జన్మించారు.
* జూలై 13, 1957 న సువ్రా ముఖర్జీ వివాహం ప్రణబ్ ముఖర్జీతో జరిగింది.
* వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
* సువ్రా ముఖర్జీ కుటుంబం ఆమెకు 10 సంవత్సరాల వయసులో బంగ్లాదేశ్‌లోని నరైల్ నుంచి కోలకతాకు వలస వచ్చింది.
* సువ్రా ముఖర్జీ ‘రబీంద్ర సంగీత్'లో మంచి ప్రావీణ్యం కలిగిన గాయకురాలు.
* ఇండియా, యూరప్, ఆసియా, ఆఫ్రికాలోని పలు దేశాల్లో తన బృందంతో కలిసి పలు సోలో ప్రదర్శనలు ఇచ్చారు.
* ‘గీతాంజలి ట్రూప్'ని స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఫిలాసఫీని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేయడం
* సువ్రా ముఖర్జీ ఛోకర్ అలే, చెనా అచేనయ్ చిన్ అనే రెండు పుస్తకాలు రచించారు.












Click it and Unblock the Notifications