ఎవరీ నిత్యానంద..? దేశం విడిచి ఎందుకు పారిపోయారు? కైలాస దేశం ఎలా సృష్టించారు?
స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద మృతి చెందిన వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంపై అటు నిత్యానంద అధికారిక వెబ్ సైట్ గానీ.. నిత్యానంద కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఎవరీ నిత్యానంద..? దేశం నుంచి ఎందుకు పారిపోయారు? కైలాస దేశం ఎలా సృష్టించారు? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద అలియాస్ నిత్యానంద పరమహంస గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. నిత్యానంద ధ్యానపీఠ స్థాపన నుండి మొదలు మొన్నటి కైలాస దేశ స్థాపన వరకు ఆయన జీవితంలో జరిగినవి చాలావరకు సంచలనాలు.. వివాదాలే.. మరి అటువంటి నిత్యానంద జీవిత విషయాలు, విశేషాలు ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం.
స్వామి నిత్యానంద తమిళనాడులోని తిరువన్నామలైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అరుణాచలం, లోకనాయకి. ఆయన 1978 జనవరి 1 న జన్మించారు. కొన్ని కథనాల్లో మాత్రం ఆయన 1977 మార్చి 13న జన్మించినట్లు ఉంది. స్వామి నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. ఆయకు నిత్యానంద పరమశివం, నిత్యానంద పరమహంస అనే పేర్లతోనూ పిలుస్తుంటారు. 24 ఏళ్ల వయసులో స్వామి నిత్యానంద పేరుతో తన ప్రజా జీవితాన్ని ప్రారంభించారు అరుణాచలం రాజశేఖరన్. నిత్యానందం ధ్యానపీఠం ఏర్పాటు చేసి దేశ విదేశాల్లో గురుకులాలు, ఆశ్రమాలు నిర్మించారు. నిత్యానంద ధ్యానపీఠాన్ని మొదటిసారి కర్ణాటక బెంగళూరు సమీపంలోని బిదారిలో 2003, జనవరి 1న ప్రారంభించారు. ఇప్పుడు చాలా దేశాల్లో ఈ ధ్యానపీఠం బ్రాంచులు ఏర్పడ్డాయి.
17 ఏళ్ల వయసులో..
చిన్నతనం నుంచే తనలోని దేవుడ్ని అనుభూతి చెందడం వల్ల ఆయన స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువుగా మారారు. 17 ఏళ్ల వయసులోనే నిత్యానంద దైవిక శక్తి, ధ్యానం ద్వారా తనను తాను తెలుసుకోవడం ద్వారా ఇంటిని విడిచిపెట్టారు. సంఘాలను నిర్మించడం, బోధన, వైద్య సదుపాయం అందించి లక్షలాది మంది అవసరాలను ఆయన తీర్చడం ప్రారంభించారు. నిత్యానంద చదువు విషయానికొస్తే.. ఆయన అధికారిక వెబ్ సైట్ ప్రకారం 1992లో పాఠశాల, విద్య పూర్చి చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన మెకానికల్ లో డిప్లోమా పూర్తి చేశారు.

1995లో సన్యాసంలోకి..
1995లో చెన్నైలోని రామకృష్ణ మఠంలో ఆయన సన్యానంలో చేరారు. సన్యాసంలో చేరాక ఆయన తన ఆధ్యాత్మిక సభల్లో భక్తులకు బ్రహ్మసూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు, భగవద్గీత వంటి వివిధ గ్రంథాలపై భక్తులకు ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఇక నిత్యానందపై అనేక ఆరోపణలు, వివాదాలు వచ్చాయి. భారతీయ న్యాయస్థానాలలో ఆయనపై అత్యాచారం, అపహరణలు చాలానే ఉన్నాయి. అవి ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన చాలాసార్లు కోర్టుకు హాజరయ్యారు. ఇక ఆయన నవంబర్ 2019లో ఆకస్మాత్తుగా భారత్ నుంచి మాయమయ్యారు.
ఆ శృంగార టేప్..
2010లో నిత్యానందకు సంబంధించిన ఓ శృంగార టేప్ ప్రముఖ ఛానెళ్లలో ప్రసారం అయింది. దీంతో ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు. ఆ సీడీ ప్రసారంపై ప్రముఖ నటి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ప్రముఖ పత్రికలపై కేసులు కూడా పెట్టారు. ఈ ఆరోపణల నడుమ హిందూమతానికి చెందిన దశాబ్దాల నాటి జూనియర్ ఫోంటిఫ్ పదవి నుంచి ఆయన్ను తొలగించినట్లు సమాచారం. 2018లో కర్ణాటక హైకోర్టు ఆయనపై అనేకమైన అభియోగాలు మోపింది. బెంగళూరుకు చెందిన ఓ దంపతులు.. తమ ఇద్దరు కుమార్తెలను రెండు వారాలకుపైగా కిడ్నాప్ చేశారని చెప్పి నిత్యానందపై కేసు పెట్టారు. ఇక ఇప్పటికీ ఆయనపై కొన్ని కేసులు విచారణ దశలో ఉన్నాయి.
సూర్యుడికి అడ్డుపడ్డా..
అలాగే స్వామి నిత్యానంద అనేక వివాదాస్పద ప్రసంగాలు చేశారు. కోతులు, మరికొన్ని జంతువులకు తాను సంస్కృతం, తమిళం మాట్లాడటం నేర్పిస్తున్నానంటూ ప్రసంగాలు చేసేవారు. అంతేకాక ఆయన ఆల్బర్ ఐన్ స్టీన్ సిద్ధాంతాలను కూడా సవాల్ చేశారు. అప్పట్లో దీనిపై చాలా ట్రోల్స్ వచ్చాయి. అలాగే ఓ వీడియోలో బెంగళూరులో సూర్యుడిని దాదాపు 40 నిమిషాల దాక ఉదయించకుండా అడ్డుపడ్డానని చెప్పుకొచ్చారు నిత్యానంద. అలాగే వందల వేల సంవత్సరాల క్రితమే చాలా గ్రహాలపై జీవం ఉందని చెప్పారు. ఆ గ్రహాలవాళ్లు మన గ్రహానికి ఎడ్యుకేషనల్ టూర్ పై వస్తుంటారట.
500 పుస్తకాలు రాశా..
ఇక నిత్యానంద అధికారిక వెబ్ సైట్లో 22 భాషలకు పైగా 500 పుస్తకాలు రాశారని చెప్తున్నారు. నిత్యానంద.. అతని అనుచరులు ఎక్స్ ట్రా సెన్సరీ పర్సెప్షన్ , మెటీరిలైజేషన్, బాడీ స్కానింగ్, ఎత్తును పెంచడం, పోగొట్టుకున్న వస్తువులను కనుక్కునే సామర్థ్యం.. ఇలాంటి వాటిని కూడా చేయగలమని చెప్తుంటారు. ఇక నిత్యానంద ఫ్లోరిడాకు చెందిన హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాకు 2007లో ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. వాటికన్స్ మైండ్, బాడీ, స్పిరిట్ మ్యాగజైన్ ద్వారా నిత్యానంద 100 మంది అత్యంత ఆధ్యాత్మిక ప్రతిభావంతమైన వ్యక్తుల్లో ఒకరిగా 2012లో గుర్తింపు పొందారు.
మధురై పీఠాధిపతిగా..
అలాగే 2012లో నిత్యానంద మధురై 293వ పీఠాధిపతిగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 2013లో పంచాయతీ మహా నిర్వాణి అకాఢ కార్యక్రమంలో నిత్యానందకు మహా మండలేశ్వర్ బిరుదును ప్రధానం చేశారు. నిత్యానంద ధ్యానపీఠం అనేది నిత్యానంద స్థాపించిన ఒక మతపరమైన సంస్థ. ఈ సంస్థ అమెరికాతో పాటు భారత్ లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. దీనికి రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. ఒకటి అతిపెద్ద రోప్ యోగా క్లాస్ కాగా, మరొకటి అతిపెద్ద పోల్ యోగా క్లాస్.
కైలాస దేశం సృష్టించా..
ఇక అన్నింటికంటే సంచలన విషయం నిత్యానంద ఏకంగా ఒక దేశాన్నే స్థాపించడం. ఒకప్పుడు కర్ణాటకలో ఆశ్రమం స్థాపించి లీలలు ప్రదర్శించిన స్వామి నిత్యానంద..ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన భక్తుల కోసం ఓ దేశాన్నే సృష్టించారు. ఈక్వెడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపంలో ఆయన కైలాస దేశం పేరుతో నిర్మించారు. హిందూ దేశంగా ప్రకటించారు. ఈ దేశంపై ఓ ప్రత్యేక వెబ్ సైట్ కూడా ఉంది. ఇక ఈ దేశానికి వెళ్లాలంటే ప్రత్యేక పాస్ పోర్టు అవసరం ఉంటుంది. అలాగే ఈ దేశానికి జాతీయ పతాకాన్ని సైతం రూపొందించుకున్నారు నిత్యానంద. నిత్యానంద ధ్యానంలో కూర్చొన్న ఫొటో జాతీయ చిహ్నంగా ప్రకటించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస..
కైలాస దేశాన్ని గుర్తించాలని కోరుతూ నిత్యానంద ఐక్యరాజ్యసమితి కి విన్నపనలు కూడా చేశారు. ప్రపంచంలో హిందూ దేశాలు తగ్గుతున్నాయని.. అందుకే తాను ప్రత్యేకంగా హిందూ దేశాన్ని సృష్టించినట్లు నిత్యానంద గతంలో చెప్పుకొచ్చారు. ఈ దేశంలో పౌరసత్వం పొందాలంటే భారీగా విరాళాలు ఇవ్వాలట. అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా ఇక్కడ భూముల ధరలను నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే నిత్యానంద తన సొంత బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస ను కూడా స్టార్ట్ చేశారు. ఈ దేశానికి సంబంధించిన కరెన్సీ నాణేలను కూడా విడుదల చేశారు. ఈ కరెన్సీ వేరే దేశాల్లో చెల్లుబాటు అయ్యేలా ఆయా దేశాలతో ఒప్పందం కూడా కుదుర్చుకుంటున్నట్లు గతంలో నిత్యానంద తెలిపారు. అలాగే కైలాస దేశంలో అన్ని దేశాల కరెన్సీలు కూడా చెల్లుబాటు అవుతాయని అన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications