Swamiji: మఠంలో ఆ 47 ఫోటోలు మాయం, చోరీ కేసులో మాజీ ఎమ్మెల్యే అందర్, భార్య కోసం ? !
బెంగళూరు/చిత్రదుర్గా: ప్రముఖ మఠంలోని స్కూల్ లో చదువుతున్న అమ్మాయిల మీద లైంగిక వేధిపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ స్వామీజీ అరెస్టు అయ్యి జైలుకు వెళ్లారు. జైల్లో నుంచి బయటకు రావాలని స్వామీజీ కోర్టును ఆశ్రయించి బెయిల్ తీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల స్వామీజీ ఆశ్రమంలో చాలా ముఖ్యమైన ఫోటోలు చోరీ అయ్మాయి. మఠం ఆవరణంలో ఫోటోలు మాయం కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు మాజీ ఎమ్మెల్యేని అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే భార్యను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

జైలుకు వెళ్లిన స్వామీజీ
కర్ణాటకలోని చిత్రదుర్గా సమీపంలోని మురుగా మఠం స్వామీజీ ఆమఠంలోని స్కూల్ లో చదువుతున్న అమ్మాయిల మీద లైంగిక వేధిపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. కేసు నమోదు చేసిన పోలీసులు స్వామీజీ అరెస్టు అయ్యి జైలుకు పంపించారు. ఈ కేసులె ఇటీవల పోలీసులు కోర్టులో షార్జ్ షీటు దాఖలు చేశారు.

మఠంలో ఫోటోలు మాయం
జైల్లో నుంచి బయటకు రావాలని మురుగా మఠం స్వామీజీ కోర్టును ఆశ్రయించి బెయిల్ తీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల మురుగా మఠం ఆవరణంలో చాలా ముఖ్యమైన ఫోటోలు చోరీ అయ్మాయి. ప్రముఖులు, రాజకీయ నాయకులు మఠానికి వెళ్లిన సమయంలో స్వామీజీ వారితో ఫోటోలు తీసుకున్నారు, ఆ ఫోటోలు ఆశ్రమం ఆవరణంలో హాట్ లోని గొడలకు పెట్టారు

మాజీ ఎమ్మెల్యే అరెస్టు
మఠం ఆవరణంలో ఏకంగా 47 ఫోటోలు మాయం కావడంతో రంగంలోకి దిగిన చిత్రదుర్గా గ్రామీణ పోలీసులు మాజీ ఎమ్మెల్యే బసవరాజన్ ను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే బసవరాజన్ భార్య సౌభాగ్యను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యాలని చిత్రదుర్గా గ్రామీణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే కొందరు అరెస్టు
మురుగా మఠంలో 27 ఫోటోలు మాయం అయిన కేసులో ఇదే నెల 7వ తేదీన హోసహళ్లి గ్రామ పంచాయితీ సభ్యుడు మోహన్ మూర్తి అలియాస్ మోహన్ స్వామిని, ఎస్ జేఎం కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్న శివానందస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరూ ఇచ్చిన సమాచారం మేరకు గురువారం మాజీ ఎమ్మెల్యే బసవరాజన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

ఆ ఫోటోలు ఏం చేశారు ?
మాజీ ఎమ్మెల్యే బసవరాజన్ ప్రోద్బలంతోనే మఠంలో 47 ఫోటోలు మాయం చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బసవరాజన్ ఇంటిలో, ఆయనకు సంబంధించిన వారి నివాసాలు, కార్యాలయాల్లో మఠంలో మాయం అయిన ఫోటోల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం మీద మరోసారి మురుగా మఠం వార్తల్లోకి వచ్చింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications