Swamiji: స్వామీజీ ఆత్మహత్య, ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి, లాయర్ కు కోర్టులో ఎదురుదెబ్బ, అక్కడే !

బెంగళూరు: కర్ణాటకలోని బండేమఠం మఠాధిపతి శ్రీ బసవలింగ స్వామీజీ (45) ఆత్మహత్య కేసులో అరెస్టు అయిన నిందితులకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల రాత్రి మఠంలోని తన గదిలోకి వెళ్లిన బసవలింగ స్వామీజీ ఉదయం అదే గదిలో శవమై కనిపించారు. గదిలోని కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ మఠానికి చెందిన భక్తులు హడలిపోయారు. స్వామీజీ ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాశారు. శ్రీబసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసులో కణ్ణూరు మఠానికి చెందిన స్వామీజీ, ఓ లాయర్, ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి అరెస్టు కావడం కలకలం రేపింది. ఈ కేసులో బెయిల్ తీసుకోవాలని ప్రయత్నించిన నిందితులకు కోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

మఠంలో స్వామీజీ ఆత్మహత్య

మఠంలో స్వామీజీ ఆత్మహత్య

బెంగళూరు గ్రామీణ జిల్లా సమీపంలోని మాగడి తాలుకాలో కంచుగల్ బండే మఠం మఠాధిపతిగా బసవలింగ స్వామీజీ (45) పని చేస్తున్నారు. కంచుగల్ బండే మఠాధిపతి బసవలింగ స్వామీజీ భక్తుల దగ్గర మంచి పేరు సంపాధించుకున్నారు. గత నెల 30వ తేదీ రాత్రి మఠంలోని తన గదిలోకి వెళ్లిన శ్రీ బసవలింగ స్వామీజీ ఉదయం అదే గదిలో ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించారు.

సుమోటో కేసు

సుమోటో కేసు

కంచుగల్ బండే మఠంలో మఠాధిపతి బసవలింగ స్వామీజీ బసచేసే గదిలోని కిటికీకి ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీ బసవలింగ స్వామీజీ ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాశారు. మాగడి పోలీసులు స్వామీజీ ఆత్మహత్య కేసును సుమోటో కేసుగా నమోదు చేసి విచారణ చేశారు.

స్వామీజీకి సోదరుడి టార్చర్ ?

స్వామీజీకి సోదరుడి టార్చర్ ?

కుంచుగల్ బండే మఠం మఠాధిపతిగా శ్రీ బసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసులో కణ్ణూరు మఠాధిపతి డాక్టర్ మృత్యుంజయ స్వామీజీ అరెస్టు కావడం కర్ణాటకలో కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకున్న స్వామీజీ శ్రీ బసవలింగ స్వామీజీ, కణ్ణూరు మఠాధిపతి డాక్టర్ మృత్యుంజయ స్వామీజీ దాయాదులు. ఇద్దరికి ఆస్తి తగాదాలు, మఠం స్వాధీనం విషయంలో గొడవలు జరుగుతున్నాయని వెలుగు చూసింది.

కాలేజ్ అమ్మాయితో హనీట్రాప్ ?

కాలేజ్ అమ్మాయితో హనీట్రాప్ ?

బండే మఠం మఠాధిపతిగా శ్రీ బసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసులో కణ్ణూరు మఠాధిపతి డాక్టర్ మృత్యుంజయ స్వామీజీతో పాటు కర్ణాటకలోని దోడబ్బళ్లాపురంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న నీలాంబిక అలియాస్ చందు అనే యువతి, తుమకూరుకు చెందిన లాయర్ మహదేవయ్య అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది. ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి నీలాంభికతో స్వామీజీకి హనీట్రాప్ వల వేశారని వెలుగు చూసింది.

కాలేజ్ అమ్మాయితో స్కెచ్ రివర్స్

కాలేజ్ అమ్మాయితో స్కెచ్ రివర్స్

ఫిబ్రవరి నెల నుంచి హనీట్రాప్ స్కెచ్ వేసిన ఏప్రిల్ నెల నుంచి శ్రీబసవలింగ స్వామీజీ అర్ధనగ్నంగా ఉన్న సమయంలో వీడియోలు చిత్రీకరించారని, తరువాత వాటిని లాయర్ మహదేవయ్య ఇంజనీరింగ్ అమ్మాయి ముఖం కనపడకుండా ఎడిటింగ్ చేసి ఆ వీడియోలు వీరశైవ మఠాధిపతులు అందరికి పంపించారని, అవమానంగా బావించిన శ్రీ బసవలింగ స్వామీజీ ఆత్మహత్య చేసుకున్నారని వెలుగు చూసింది.

స్వామీజీ కేసులో నో బెయిల్

స్వామీజీ కేసులో నో బెయిల్

ఈ కేసులో బెయిల్ కావాలని కణ్ణూరు మఠాధిపతి డాక్టర్ మృత్యుంజయ స్వామీజీ, లాయర్ మహదేవయ్య, ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి నీలాంభిక కోర్టును ఆశ్రయించారు. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షాలు తారుమారు అవుతాయని పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. కేసు వివరాలు తెలుసుకున్ప మాగడి జేఎంఎఫ్ సీ కోర్టు ముగ్గురు నిందితులకు ఈనెల 29వ తేదీ వరకు రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+