ఫస్ట్ బ్లాక్ మెయిల్ కేసు పెట్టిన స్వామీజీ, రివర్స్ కేసులో ఎత్తిలోపల వేసిన పోలీసులు, అమ్మాయితో !

కర్ణాటకలోని చిత్రదుర్గ మురుగ మఠానికి చెందిన మురుగాశ్రీని అరెస్టు చేసిన తర్వాత తుమకూరుకు చెందిన మరో స్వామీజీని అరెస్ట్ చెయ్యడం ఇప్పుడు ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. తుమకూరు జిల్లాలోని హంగరహళ్లి విద్యాచౌడేశ్వరి మఠంలో పీఠాధిపతిగా ఉన్న బాలమంజునాథ్ స్వామీజీ అదే మఠంలోని మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలపై కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు.

మైనర్ బాలిక విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై శ్రీ మురుగను గతంలో పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా మైనర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై తుమకూరు జిల్లా హులియూర్‌దుర్గలోని హులియూర్‌దుర్గలోని శ్రీ విద్యా చౌడేశ్వరి మహా సంస్థాన్ మఠానికి చెందిన బాల మంజునాథ్ స్వామీజీని కూడా ఇప్పుడు అరెస్టు చెయ్యడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తూ కుణిగల్ తాలూకాలోని హులియూర్‌దుర్గకు చెందిన హంగరనహళ్లి శ్రీ విద్యా చౌడేశ్వరి మహా సంస్థాన్ మఠానికి చెందిన బాల మంజునాథ్ స్వామీజీ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Swamiji was arrested by the Karnataka police in a case of sexual harassment of a minor girl

అయితే స్వామిజీ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న అదే నిందితుడు విచారణలో స్వామీజీ మరో మోసాన్ని బయటపెట్టాడు. దీంతో గురువారం రాత్రి పోలీసులు బాల మంజునాథ స్వామీజీని అదుపులోకి తీసుకున్నారు. బాల మంజునాథ్ స్వామీజీ తన చర్మవ్యాధి సమస్యను అభిషేక్ అనే వ్యక్తికి చెప్పారు. అభిషేక్ ఆ మహిళను స్వామీజీకి పరిచయం చేసి ఆమె డాక్టర్ అని చెప్పాడు. ఆ మహిళకు చర్మవ్యాధిని చూపించడం ఇష్టంలేక బాల మంజునాథ స్వామీజీ ఆ ఫొటోను ఆమె మొబైల్‌కు వాట్సాప్ లో పంపాడు. వీడియో కాల్ ద్వారా వ్యాధి గురించి డాక్టర్‌తో మాట్లాడేందుకు బాల మంజునాథ స్వామీజీ అనుమతించారు.

అప్పుడు బాల మంజునాథ స్వామీజీ ఆయనకు చర్మ వ్యాది సోకిన ప్రాంతాన్ని వీడియె కాల్ లో చూపించారు. అభిషేక్ తో ఇతరులు ఇదే వీడియోను రికార్డ్ చేస్తూ స్వామీజీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆలయ ధర్మకర్త ఫిబ్రవరి 10వ తేదీన అభిలాష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుణిగల్ తాలూకా హోసకెరె గ్రామంలో నివాసం ఉండే అభిషేక్, బెంగళూరుకు చెందిన యువతి, పాండవపుర సమీపంలోని విజయకాళి ఆలయానికి చెందిన రాజేష్, శ్రీనివాస్, రామనగర జిల్లా కవాన్‌పురా గ్రామానికి చెందిన చేతన్, కుణిగల్‌కు చెందిన నందీష్‌లపై మఠం స్వామీజీ బాల మంజునాథ స్వామీజీ, ఆలయ కమిటీ ధర్మకర్తల మండలి సిబ్బంది ఫిర్యాదు చేశారు.

Swamiji was arrested by the Karnataka police in a case of sexual harassment of a minor girl

ఆలయ ధర్మకర్త అభిషేక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అభిషేక్‌ను పిలిపించి విచారించగా అసలు మ్యాటర్ బయటకు వచ్చిందని పోలీసులు అంటున్నారు. బాల మంజునాథ స్వామీజీ చాలా రోజుల క్రితం నుంచి మఠంలో మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అభిషేక్ ఆరోపించారు. ఈ వ్యవహారం పోక్సో చట్టం కిందకు రావడంతో పోలీసులు మఠానికి చేరుకుని గురువారం రాత్రి మఠంలో తనిఖీలు నిర్వహించారు. అప్పుడు దొరికిన కొన్ని పత్రాలు, సాక్షాల ఆధారంగా బాల మంజునాథ స్వామీజీని అరెస్టు చేశారు. శివరాత్రి పండుగ కొన్ని గంటలకు ముందు కర్ణాటకలో ప్రముఖ మఠానికి చెందిన స్వామీజీ అరెస్టు కావడం కర్ణాటకలో కలకలం రేపింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+