ఆ ప్రభుత్వంతో తనకు ప్రాణహాని ఉంది, బాంబులు పెడుతామని వార్నింగ్, ఐటీ హబ్ లో స్వప్నా సురేష్ !

విదేశాల నుంచి కోట్ల విలువైన బంగారం కేరళకు స్మగ్లింగ్ చేసిన కేసులో అరెస్టు అయిన ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరు/కొచ్చి: విదేశాల నుంచి కోట్లాది రూపాయల విలువైన బంగారం కేరళకు స్మగ్లింగ్ చేసిన కేసులో అరెస్టు అయిన ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్ అలియాస్ స్వప్నా మేడమ్ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. బంగారం స్మగ్లింగ్ కేసులో కేరళ సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పెర్లు చెప్పకూడదని, అందుకు నీకు రూ. 30 కోట్లు ఇస్తామని, మా మాట వినకుంటే నిన్ను చంపేస్తామని నన్ను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ స్వప్నా సురేష్ బెంగళూరులో కేసు పెట్టింది. స్వప్నా సురేష్ కేసు పెట్టడంతో కేరళకు చెందిన విజేష్ పిళ్లైని బెంగళూరు పోలీసులు విచారణ చేశారు.

సీఎం ఫ్యామిలీకి లింక్ పెట్టిన స్వప్నా సురేష్

సీఎం ఫ్యామిలీకి లింక్ పెట్టిన స్వప్నా సురేష్

విదేశాల నుంచి కోట్లాది రూపాయల విలువైన బంగారం కేరళకు స్మగ్లింగ్ చేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కేరళ బంగారు స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్ అలియాస్ స్వప్నా జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చింది. కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బంగారు స్మగ్లింగ్ కేసుతో సంబంధం ఉందని స్వప్నా సురేష్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చెయ్యడం దూమరం రేపింది.

భయంతో బెంగళూరుకు స్వప్నా సురేష్

భయంతో బెంగళూరుకు స్వప్నా సురేష్

ఏకంగా కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేసిన స్వప్నా సురేష్ మీద కేరళలోని అధికార పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేరళలో ఉంటే అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలతో లేనిపోని సమస్యలు వస్తాయని గ్రహించిన స్వప్నా సురేష్ కేరళ ఖాళీ చేసి కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు చేరుకుని ఐటీపీఎల్ సమీపంలోని హూడీలోని ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నది.

చంపేస్తామని బెదిరించారు

చంపేస్తామని బెదిరించారు

ఇటీవల స్వప్నా సురేష్ కేఆర్ పురం పోలీస్ స్టేషన్ లో విజేష్ పిళ్లే అనే వ్యక్తి మీద కేసు పెట్టింది. మార్చి 4వ తేదీన విజేష్ పిళ్లై తనకు ఫోన్ చేసి వైట్ ఫీల్డ్ లోని జ్యూరీ హోటల్ కు రావాలని చెప్పాడని స్వప్నా సురేష్ పోలీసులకు చెప్పింది. అదే రోజు తాను జ్యూరీ హోటల్ కు వెళ్లానని, ఆ సమయంలో కేరళ సీపీఐ (ఎం) పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంవీ, గోవిందన్ తనను పంపించాడని విజేష్ పిళ్లై తనను జ్యూరీ హోటల్ లో పరిచయం చేసుకున్నాడని స్వప్నా సురేష్ పోలీసులకు చెప్పింది.

రూ. 30 కోట్లు తీసుకో.... లేదంటే చంపేస్తామ్

రూ. 30 కోట్లు తీసుకో.... లేదంటే చంపేస్తామ్

బంగారు స్మగ్లింగ్ కేసు విషయంలో కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పెర్లు చెప్పకూడదని, అందుకు నీకు రూ. 30 కోట్లు ఇస్తామని, వారం లోపు బెంగళూరు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించారని స్వప్నా సురేష్ ఆరోపిస్తుంది. మా మాట వినకుంటే నీ బ్యాగ్ లో బాంబు పెట్టి నీకు ఉగ్రవాదులతో లింక్ ఉందని పోలీసులకు పట్టించి జైలుకు పంపిస్తామని, లేదంటే నిన్ను చంపేస్తామని నన్ను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ స్వప్నా సురేష్ బెంగళూరులోని కేఆర్ పురం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

ఏం జరిగింది ?

ఏం జరిగింది ?

పోలీసు కేసు పెట్టిన తరువాత బెంగళూరులో స్వప్నా సురేష్ బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. కేళర ప్రభుత్వంలోని కొందరు పెద్దలతో తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆరోపించింది. కేరళకు చెందిన విజేష్ పిళ్లైకి నోటీసులు ఇచ్చిన కేఆర్ పురం పోలీసులు విచారణకు రావాలని ఆదేశించారు. విజేష్ పిళ్లై విచారణకు హాజరైనాడని, అతని నుంచి వివరాలు సేకరించామని, అన్నీ పరిశీలించిన తరువాత సరైన చర్యలు తీసుకుంటామని శనివారం కేఆర్ పురం పోలీసులు మీడియాకు చెప్పారు. కేరళ బంగారు స్మగ్లింగ్ కేసు వ్యవహారం రెండో చాప్టర్ ఇప్పుడు బెంగళూరులో మొదలైయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+