మోదీకి నచ్చని మాట చెప్పేసిన స్వరూపానంద..! భవిశ్యత్ పరిణామాలపై బీజేపి దృష్టి..!!
ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది. డాషింగ్ నిర్ణయాలు తీసుకోవడం, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయడం, ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడం వంటి రాజకీయాలు ఆయన ప్రత్యేకతగా చెప్పొచ్చనే చర్చ జరుగుతోంది. తన ముందు ఇతర పార్టీ నేతలను పొగిడినా, తన పార్టీ కాకుండా ఇతర పార్టీల గురించి గొప్పగా ప్రస్థావన తెచ్చినా ఆయన అంతగా భరించలేరు. అందుకే తనకు మిత్రులు గాని, శత్రువులు గాని శాశ్వతంగా ఉండరు. ఏ రాష్ట్రంలో అయినా నరేంద్రమోడీ ఎవరితో అయినా స్నేహం చేస్తే అది ఇంకొకరిమీద పై చేయి సాధించడానికే గాని ఒకరిమీద ప్రేమతో కాదనే విషయం ఇప్పటికే స్పస్టమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు చంద్రశేఖర్ రావుతో మోడీ సఖ్యతగా ఉన్నారు. దీనికి కారణం చంద్రశేఖర్ రావు అంటే మోడీకి ఇష్టం అని కాదు, కాంగ్రెస్ ను దెబ్బకొట్టడానికి మోడీ వేసిన ప్లాన్లో చంద్రశేఖర్ రావు తో పాటు బీజేపి ఎంతో లబ్ధి పొందింది. అంతే. కాంగ్రెస్ ను తెలంగాణలో ఖతం చేయాలనే మోడీ లక్ష్యం నెరవేరింది. 2024లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం దిశగా మోదీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆధ్యాత్మిక వేత్త స్వరూపానంద స్వామి మోదీ చెవులకు కర్ణకఠోరమైన మాటలు వినిపించారు.
Recommended Video


2024 తర్వాత ప్రభుత్వాన్ని దించేయడానికి సిద్ధమైపోయినట్టు సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆద్యాత్మిక గురువులు రాజకీయ పార్టీల గురించి భిన్నంగా వ్యాఖ్యలు చేయడాన్ని మోదీకి అంతగా రుచించడంలేదనే అంశం స్పష్టమవుతోంది. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం బలహీనపడుతోందని గత లోక్ సభఎన్నికలు నిరూపించాయి. చంద్రశేఖర్ రావు ను దించడానికి ప్రజలు కూడా కాంగ్రెస్ స్థానంలో మోడీని వాడదామనుకోవడం బీజేపీకి కలిసొస్తోంది. అంటే బీజేపీకి పడే ప్రతి ఓటు చంద్ర శేఖర్ రావుపై కోపంతోనే అని చెప్పొచ్చు. అయితే మోడీ వ్యూహానికి విరుద్ధంగా ఆధ్యాత్మిక వేత్త స్వరూపానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. మోడీకి చెవులకు నచ్చని మాట చెప్పారు. 15 ఏళ్లు చంద్ర శేఖర్ రావు సీఎంగా ఉండాలని దీవించారు. ఈ మాటతో స్వరూపానంద మోడీ కంట్లో పడ్డారు. ఇక సమీప భవిష్యత్తులో ఆ వేడి ఏంటో స్వరూపానందకు తగలకతప్పదనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు ఏపీలో సీఎం జగన్ ని కూడా దీవించారు స్వరూపానంద. అక్కడ బీజేపీ టార్గెట్ 2029. కానీ 2039 వరకు జగనే సీఎంగా ఉండాలని స్వరూపానంద ఆకాంక్షిస్తున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో మోడీ ఎంట్రీని స్వరూపానంద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు విశాఖ స్వాములు. స్వాముల వ్యాఖ్యలను మోదీ-షా ద్వయం అంత తేలిగ్గా తీసుకోదనే చర్చ జరుగుతోంది.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications