Swati Maliwal: చెంపదెబ్బలు, ఛాతీపై, పొట్టలో కొట్టాడు-ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ షాకింగ్..!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ అనుచరుడు విభవ్ కుమార్ తనపై జరిపిన అమానుష, అకారణ దాడిపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆప్ మహిళా ఎంపీ స్వాతీ మలివాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కేజ్రివాల్ డ్రాయింగ్ రూమ్ లో ఆయన సమక్షంలోనే తనపై ఆయన అనుచరుడు విభవ్ కుమార్ ఎంత దారుణంగా దాడి చేశాడో స్వాతి చేసిన ఆరోపణల్ని పోలీసులు ఎఫ్ఐఆర్ లో రాశారు. ఇవి చూస్తే ఈ దాడి తీవ్రత అర్దమవుతోంది.

కేజ్రివాల్ ఇంటికి తాను వెళ్లానని, ఆయన డ్రాయింగ్ రూమ్ లో ఉన్నారని, అదే సమయంలో అకారణంగా తనపై ఆయన అనుచరుడు విభవ్ కుమార్ చేయిచేసుకున్నాడని స్వాతి మలివాల్ ఆరోపించారు. ఏడు, ఎనిమిది చెంపదెబ్బలు కొట్టాడని, ఆ తర్వాత ఛాతీపై, కడుపులో కూడా కొట్టాడని స్వాతి ఆరోపించారు. తాను పిరియడ్స్ లో ఉన్నానని చెప్పినా, వదిలేయాలని వేడుకున్నా కనికరించలేదని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపారు.

swati maliwal alleged keriwal s aid slapped and kicked in chest stomach

తాను అరుపులు కేకలు పెడుతున్నా పట్టించుకోలేదని, వదిలేయమని చెప్పినా వినలేదని స్వాతి పేర్కొన్నారు. సాయం కోసం ఆర్తనాదాలు చేశానన్నారు. ఓ దశలో తాను కాళ్లతో అతని దూరంగా నెట్టేశానని, దీంతో మరింత కోపంగా తన ఛాతీపై, కడుపులో కాళ్లతో తన్నాడని ఆమె ఆరోపించారు. తనపై చేసిన దాడికి అతనికి ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నారు. అప్పుడు తాను పోలీసులకు ఫోన్ చేశానని, అక్కడి నుంచి పారిపోయి బయటపడ్డానన్నారు. ఇప్పటికే ఈ దాడిపై మహిళా కమిషన్ స్పందించి సుమోటో విచారణకు నిందితుడికి సమన్లు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+