వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింధియాకు స్వైన్ ప్లూ, అందుకే టచ్‌లోకి రావడం లేదు, దిగ్గీరాజా హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ టైమింగ్ పంచులతో మీడియా ప్రతినిధులనే తికమక పెడుతుంటారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణమైన జ్యోతిరాదిత్య సింధియా 17 మంది ఎమ్మెల్యేలతో కర్ణాటకలో మకాం వేశారు. సింధియా నచ్చజెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. కానీ సింధియా మాత్రం మెట్టుదిగడం లేదు. దీంతో మధ్యప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలపై దిగ్విజయ్ సింగ్‌ను వివరణ కోరితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇచ్చారు.

h1n1..

h1n1..

ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తోన్న సింధియాను కలిసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని దిగ్గీ రాజా తెలిపారు. కానీ అతనికి స్వైన్ ప్లూ ఉన్నట్టుంది.. అందుకే తమతో మాట్లాడటం వీలుకావడం లేదు అని తనదైనశైలిలో సెటైర్ వేశారు. తిరుగుబాటు జెండా ఎగరవేసి.. కమలదళంతో సన్నిహితంగా ఉంటోన్న సింధియాకు దిగ్గీరాజా కౌంటర్ ఇచ్చారు.

 ఇదీ సరికాదు..

ఇదీ సరికాదు..

మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవపరిస్తే.. వారికే జనమే బుద్ధి చెబుతారని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. పార్టీ కోసం నిజాయితీ పనిచేసిన వారు.. కట్టుబడే ఉంటారని, సింధియాను ఉద్దేశించి దిగ్విజయ్ సింగ్ కామెంట్ చేశారు. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం పరిస్థితి అంతా బాగానే ఉంది అని వివరించారు. గత రాత్రి నుంచి మధ్యప్రదేశ్‌లో హై డ్రామా నడుస్తోంది. తనకు అనుకూలంగా ఉన్న 17 మందిని తీసుకొని బెంగళూరు వెళ్లారు సింధియా. వీరిలో ఆరుగురు మంత్రులు ఉన్నారు.

 సన్నిహితంగా మెలిగే..

సన్నిహితంగా మెలిగే..

గాంధీ-నెహ్రూ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మెలిగిన సింధియా.. బీజేపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తమ దారిలోకి వస్తే రాజ్యసభకు పంపిస్తామని కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ నేతలతో సింధియ టచ్‌లోకి రాలేదు. దీంతో మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్.. సింధియాకు స్వైన్ ప్లూ ఉంది అని విమర్శలు చేశారు.

Recommended Video

AP Cabinet Decides To Hold Local Body Polls Before March 15| Oneindia Telugu
 కమల‘చాణక్యం'

కమల‘చాణక్యం'

వ్యుహాలు రూపొందించడంలో దిట్ట అయిన కమల్ నాథ్.. కాంగ్రెస్ హైకమాండ్‌తో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. హై కమాండ్ ఆదేశాల మేరకు 22 మంత్రుల చేత రాజీనామా చేయించారు. సింధియా క్యాంప్‌లో ఉన్నవారికి మంత్రి పదవులు ఇస్తామని ఆఫర్ చేశారు. దీంతో ఎమ్మెల్యేలు కూడా మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. కానీ సింధియా మాత్రం కాంగ్రెస్ నేతలకు ఇప్పటివరకు టచ్‌లోకి రాకపోవడంతో.. మధ్యప్రదేశ్ రాజకీయాలు క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోన్నాయి.

English summary
The Congress is unable to reach senior party Jyotiraditya Scindia - at the centre of political trouble brewing in Madhya Pradesh for the 15-month-old Kamal Nath government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X