బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో హైటెక్ వేశ్యవాటిక: స్వైపింగ్ మిషన్లలో ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పెద్ద నోట్లు రద్దు కారణంగా వేశ్యవాటిక కేంద్రాలపై పెద్ద ప్రభావం చూపించిందని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. హైటెక్ వేశ్యవాటిక కేంద్రాల్లో అన్నీ అందుబాటులో ఉంటాయని వెలుగు చూసింది.

బెంగళూరులో హైటెక్ వేశ్యవాటిక కేంద్రాల్లో డబ్బులు లేకపోయినా సరే డెబిట్, క్రిడిట్ కార్డులు గోకేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. విటుల దగ్గర డబ్బులు తీసుకోకుండా స్వైపింగ్ మిషన్లలో వారి కార్డులు స్వైప్ చేసి వారి అకౌంట్లలో నగదు డిపాజిట్ చేయించుకుంటున్నారు.

బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ రెండవ ఫేస్ లోని ఆనందరెడ్డి లేఔట్ లోని ఓ ఇంటిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన అల్కాసింగ్, బెంగళూరుకు చెందిన నహీం అనే ఇద్దరు హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారు. స్థానికులకు అనుమానం వచ్చి సమాచారం ఇవ్వడంతో ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు.

Swiping machine found at prostitution home in Bengaluru.

ఆ సమయంలో అక్కడ స్వైపింగ్ మిషన్లు చూసిన పోలీసులు షాక్ కు గురైనారు. హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్న అల్కాసింగ్, నహీంలతో పాటు విటులను అరెస్టు చేశారు. వారి నుంచి స్వైపింగ్ మిషన్లు, మొబైల్ ఫోన్లు, క్రెడిట్, డెబిట్ కార్డులు, నగదు, బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.

కోల్ కత్తాకు చెందిన యువతులను రక్షించామని పోలీసులు చెప్పారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతులను నమ్మించి ఇంటిలో నిర్బందించి వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

డబ్బులు లేకపోయినా సరే విటుల దగ్గర ఉన్న క్రిడిట్, డిబిట్ కార్డులను స్వైమింగ్ మిషన్ లో స్వైప్ చేసి వారి అకౌంట్లలో నగదు డిపాజిట్ అయ్యే విధంగా దందా నిర్వహిస్తున్నారని పోలీసు అధికారులు వివరించారు.

English summary
Rs.1,000 and Rs. 500 note ban effect swiping machine found at prostitution home. Parappana agrahara police raided the house at Anand Reddy layout in electronics city 2nd stage Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X