వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

13న లోకసభలో టీ బిల్లు: స్పీకర్ పరిధిలోదన్న డిగ్గీ

By Pratap
|
Google Oneindia TeluguNews

T bill will be introduced on feb 13 in Loksabha
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లును (తెలంగాణ బిల్లును) ఈ నెల 13వ తేదీలో లోకసభలో ప్రవేశపెట్టాలని కాంగ్రెసు కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అత్యవసరంగా కాంగ్రెసు కోర్ కమిటీ మంగళవారం సాయంత్రం సమావేశమైంది. తెలంగాణ బిల్లు ఆర్థికపరమైందా, కాగా అనే అంశంపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

పార్లమెంటు ఉభయ సభల్లో ముందు ఓ సభలో ప్రవేశపెట్టాలనే అంశంపై కూడా సమావేశంలో చర్చించారు. ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశంపై చర్చించి ఈ నెల 13వ తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే లోకసభ స్పీకర్ మీరా కుమార్‌ను కలిశారు. బిల్లు ప్రతిపాదనపై ఆయన స్పీకర్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది.

కాంగ్రెసు పార్టీ నుంచి ఆరుగురు పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా స్పీకర్‌కు తెలిపినట్లు సమాచారం. కాగా, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినందుకే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటున్న సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయాలా, వద్దా అనే విషయం స్పీకర్ పరిధిలోని విషయమని ఆయన అన్నారు.

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఎంపీలు ఎంతగా నచ్చజెప్పినా వినలేదని, అవిశ్వాస తీర్మానంపై సంతకం చేయడం పార్టీ వ్యతిరేక చర్య అని దిగ్విజయ్ సింగ్ అన్నారు. తాము పార్టీ నుంచి మాత్రమే బయటకు పంపించామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆయన అన్నారు. కాంగ్రెసులో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విలీనం గురించి కెసిఆర్‌నే అడగాలని ఆయన అన్నారు. కెసిఆర్ అన్ని పార్టీల నాయకులనూ కలుస్తున్నారని ఆయన చెప్పారు.

కాగా, తమ భవిష్యత్తు కారాచరణ రూపకల్పనకు సస్పెన్షన్‌కు గురైన ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు, హర్షకుమార్, సాయి ప్రతాప్, సబ్బం హరి మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. వారు ఉండవల్లి అరుణ్ కుమార్ నివాసంలో సమావేశమయ్యారు.

English summary
Congress core committee has decided to introduce Telangana bill in Loksabha on february 13.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X