వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ20 వరల్డ్ కప్: దక్షిణాఫ్రికాను గెలిపించిన రబడ హ్యాట్రిక్, టీ20 ప్రపంచకప్‌లో ఇది నాలుగో 'హ్యాట్రిక్'

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

శనివారం షార్జాలో సెమీస్ చేరడానికి కీలకమైన మ్యాచ్‌లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా నెట్ రన్ రేట్ లెక్కల్లో మాత్రం ఓడిపోయింది.

చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చివరి ఓవర్ మొదటి మూడు బంతులకు హ్యాట్రిక్ తీసిన కగిసో రబడ ఇంగ్లండ్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.

ఈ ఫీట్‌తో టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన మొదటి దక్షిణాఫ్రికా బౌలర్‌గా రికార్డు సృష్టించిన రబడ టీ20 వరల్డ్ కప్ 2021లో హ్యాట్రిక్ తీసిన మూడో బౌలర్ అయ్యాడు. మొత్తంగా టీ20 వరల్డ్ కప్ పోటీలలో రబడది నాలుగో హ్యాట్రిక్.

https://twitter.com/Sports_amaze/status/1457041279670308866

ఇంగ్లండ్ సులభంగా విజయం సాధిస్తుందనుకున్న దశలో రబడ హ్యాట్రిక్‌తో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరికి 10 పరుగులు తేడాతో దక్షిణాఫ్రికాకు విజయం అందించింది.

చివరి ఓవర్లో విజయానికి 14 పరుగులు అవసరమైన దశలో మొదటి మూడు బంతులకే క్రిస్ వోక్స్, ఇయాన్ మోర్గాన్, క్రిస్ జోర్డాన్ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. చివరి మూడు బంతులకు మూడు పరుగులే చేయగలిగింది.

మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 2 వికెట్లకు 189 పరుగుల భారీ స్కోరు చేయగా, ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులే చేయగలిగింది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 131 పరుగుల లోపు కట్టడి చేయలేకపోవడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించినా సెమీస్ చేరుకోలేకపోయింది.

https://mobile.twitter.com/cricketireland/status/1450064706098630660

ఐర్లాండ్ బౌలర్ రికార్డ్

ఈ ఏడాది అక్టోబర్ 17న ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మొదటి హ్యాట్రిక్ తీసిన ఘనత ఐర్లాండ్‌ బౌలర్‌కు దక్కింది. టోర్నీ గ్రూప్ స్టేజ్‌లో మూడో మ్యాచ్‌లో ఇది జరిగింది. నెదర్లాండ్స్‌తో పదో ఓవర్ వేస్తున్న కర్ట్స్ కాంఫెర్ వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదో బంతులకు వికెట్లు పడగొట్టి టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

https://twitter.com/T20WorldCup/status/1454438120166809605

హసరంగ హ్యాట్రిక్

తర్వాత గ్రూప్ 1 మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్ వాణిందు హసనరంగ దక్షిణాఫ్రికాపై ఓవర్ హ్యాట్రిక్ తీసి ఈ టోర్నీలో వరసగా మూడు వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ అయ్యాడు.

ఈ మ్యాచ్‌లో 15వ ఓవర్ చివరి బంతికి, తర్వాత వేసిన 18వ ఓవర్ మొదటి రెండు బంతులకు వికెట్లు పడగొట్టిన హసనరంగ ఈ మ్యాచ్ మాత్రం గెలిపించలేకపోయాడు.

https://twitter.com/122mlongsix/status/1456220687027224578

ఆడం జంపా హ్యాట్రిక్ మిస్

ఆస్ట్రేలియా బౌలర్ ఆడం జంపా ఇదే టోర్నీలో ఓవర్ హ్యాట్రిక్ చేజార్చుకున్నాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 11వ ఓవర్ చివరి రెండు బంతులకు షమీమ్ హుస్సేన్, మహెదీ హసన్‌లను అవుట్ చేశాడు.

జంపా వేసిన 13వ ఓవర్ మొదటి బంతి తస్కిన్ అహ్మద్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వెనక్కు వెళ్లింది. కానీ కీపర్ మాథ్యూ వేడ్ దానిని పట్టుకోలేకపోవడంతో జంపా హ్యాట్రిక్ మిస్ అయ్యాడు.

షమీ

భారత్ టీమ్ హ్యాట్రిక్

ఈ టీ20 వరల్డ్ కప్‌లో భారత్ కూడా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ హ్యాట్రిక్ సాధించింది. షమీ వేసిన 17వ ఓవర్లో స్కాట్లాండ్ వరసగా మూడు వికెట్లు కోల్పోయింది.

ఓవర్ మొదటి బంతికి కలమ్ మెక్‌లార్డ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన తర్వాత రెండో బంతికి సఫ్యాన్ షరీఫ్ రనౌట్ అయ్యాడు.

షమీ ఆ తర్వాత బంతికే అలస్డైర్ ఇవాన్స్‌ను కూడా బౌల్డ్ చేశాడు. దీంతో షమీ ఖాతాలో హ్యాట్రిక్ లేకపోయినా భారత్‌ వరసగా మూడు వికెట్లతో టీమ్ హ్యాట్రిక్ నమోదు చేసింది.

బ్రెట్ లీ

బ్రెట్ లీ తొలి బౌలర్

ఇప్పటివరకూ టీ20 వరల్డ్ కప్‌లో నలుగురు బౌలర్లు మాత్రమే హ్యాట్రిక్ తీశారు. 2007లో జరిగిన మొదటి టీ20 వరల్డ్ కప్‌లో బ్రెట్ లీ మొట్టమొదట ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత వచ్చిన మూడు హ్యాట్రిక్‌లు 2021 టీ20 వరల్డ్ కప్‌లోనే సాధించారు.

https://mobile.twitter.com/t20worldcup/status/1192592663947726848

2007 సెప్టెంబర్ 16న బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో 17వ ఓవర్ చివరి మూడు బంతులకు ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ పంపిన బ్రెట్ లీ టీ20 వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ తీసిన మొదటి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో 9 వికెట్లతో గెలిచిన ఆస్ట్రేలియా టోర్నీలో సెమీ ఫైనల్ వరకూ వెళ్లింది. రెండో సెమీ ఫైనల్లో భారత్ చేతిలో 15 పరుగుల తేడాతో ఓడింది. ధోనీ సేన ఫైనల్లో పాక్‌పై గెలిచి మొదటి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.

లసిత్ మలింగ

లసిత్ మలింగ

ఓవరాల్‌గా టీ20 ఇంటర్నేషనల్ మ్యాచుల్లో చూస్తే, మొత్తం 25 సార్లు హ్యాట్రిక్ నమోదైంది. ఒక్క శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ మాత్రమే టీ20ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ తీశాడు. బంగ్లాదేశ్, న్యూజీలాండ్‌పై మలింగ ఈ ఫీట్ సాధించాడు.

ఇక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచుల్లో లసిత్ మలింగ, అఫ్గానిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ వరుసగా నాలుగు బంతులకు నాలుగు వికెట్లు పడగొట్టిన ఘనత కూడా సాధించారు. తాజా టీ20 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్ బౌలర్ కాంఫర్ కూడా ఆ ఫీట్ సాధించిన మూడో బౌలర్ అయ్యాడు.

https://twitter.com/BCCI/status/1193582053737910273

భారత్ తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన ఘనత దీపక్ చాహర్‌కు మాత్రమే దక్కుతుంది. 2019లో బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా భారత్ ఆడిన మూడో మ్యాచ్‌లో దీపక్ చాహర్ ఈ ఫీట్ సాధించాడు. 18వ ఓవర్ చివరి బంతికి వికెట్ తీసిన చాహర్, తర్వాత చివరి ఓవర్ మొదటి రెండు బంతులకు వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
T20 World Cup: hat-trick for Rabada, wins South Africa against England, the fourth 'hat-trick' in the tourney
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X