తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు: పాక్ లష్కరే తోయిబా ఉగ్రవాది పనే
ముంబై: ప్రఖ్యాత తాజ్ హోటల్‌కు పాకిస్థాన్ నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సోమవారం అర్థరాద్రి 12.30 గంటలకు కాల్ చేసిన ఆగంతకుడు బాంబులతో హోటల్‌ను పేల్చివేస్తామంటూ బెరింపులకు పాల్పడినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్ హోటల్ తోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆగంతకుడు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

కోలాబాలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, బాంద్రాలోని తాజ్ లాండ్స్ ఇండ్ హోటల్‌లకు ఈ బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలిపారు. కాల్ చేసిన ఆగంతకుడు తనకు తానే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సభ్యుడిగా చెప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, 2008 నవంబర్ 26న ముంబై తాజ్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 166 మంది ప్రజలు మృతి చెందారు. 300 మందికిపైగా గాయపడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ దాడికి కుట్ర పన్నారు.
Recommended Video
-
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం











Click it and Unblock the Notifications