తాజ్‌మహల్‌ను వక్ఫ్‌బోర్డు ఆస్తిగా ప్రకటించండి:అజంఖాన్
న్యూఢిల్లీ: ప్రపంచ తారిత్రాత్మక కట్టడాల్లో ఒకటైన తాజ్ మహల్ ఇప్పుడు రాజకీయ యుద్ధభూమి కానుంది. అందుకు కారణం చారిత్రాత్మక కట్టడమైన తాజ్ మహల్‌ను ఉత్తర ప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించాలని ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల మంత్రి అజం ఖాన్ డిమాండ్ చేశారు.
ఉత్తర ప్రదేశ్ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో అజం ఖాన్ ఆ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. లక్నోలోని వక్ఫ్ బోర్డు మెంబర్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు.

మరో వైపు ముస్లింలకు తాజ్ మహల్ లో రోజుకు ఐదు సార్లు ప్రార్థనలకు అనుమతివ్వాలని లక్నో ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగిమహ్లీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ముందు ప్రతిపాదించారు.
సమాజ్ వాదీ పార్టీ సభ్యుడైన ఖలీద్ రషీద్ ఫిరంగిమహ్లీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడని పేరుంది. ఉత్తర ప్రదేశ్‌లో ముస్లింలకు చెందిన ఇద్దరు ముఖ్య నేతల ప్రతిపాదనను సీఎం అఖిలేష్ యాదవ్ పెడచెవిన పెట్టే అవకాశాలే లేవన్నది విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, కేంద్రం మధ్య కొనసాగుతున్న వివాదాల్లో కొత్తగా తాజ్ మహల్ చేరనుందని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. ప్రధాన మంత్రి నేరంద్రమోడీకి 17వ శతాబ్ధానికి చెందిన చారిత్రాత్మక కట్టడమైన తాజ్ మహల్ సందర్శనార్ధం సందర్శకులకు ఈ టికెటింగ్ సర్వీసులను ప్రారంభించాలని లెటర్ రాశారు.












Click it and Unblock the Notifications