తాజ్ మహల్‌పై బిజెపి ఎంపీ వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఆగ్రా: తాజ్ మహల్ వివాదం మరోసారి ముందుకు వచ్చింది. తాజ్ మహల్‌పై బిజెపి పార్లమెంటు సభ్యుడు వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తేజో మహల్‌గా ప్రసిద్ది చెందిన శివాలయాన్ని కూల్చేసి మొఘల్ చక్రవర్తి షాజహాన్ తాజ్ మహల్‌ను నిర్మించాడని నిరుడు కతియార్ వ్యాఖ్యలు చేశారు.
తాజ్ మహల్‌ను తేజ్ మందిర్‌గా మారుస్తానని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. తాజ్ మహల్‌ను హిందువులే నిర్మించారని, అందుకని దానికి తేజ్ మందిర్‌గా పేరు మారుస్తామని చెప్పారు.

ఆగ్రాలోని తాజ్ మహోత్సవ్ గురించి ప్రశ్నించినప్పుడు దాన్ని తాజ్ మహోత్సవ్‌గా గానీ తేజ్ మహోత్సవ్‌గా గానీ పిలువవచ్చునని, తాజ్‌కూ తేజ్‌కూ మధ్య తేడా లేదని, రెండు ఒక్కటేనని ఆయన సమాధాన మిచ్చారు.
ఫిబ్రవరి 18వ తేదీ నుంచి పది రోజుల పాటు ఆగ్రాలో తాజ్ మహోత్సవ్ జరుగుతుంది. ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, గవర్నర్ రామ్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు.












Click it and Unblock the Notifications