వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బేషరతుగా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న నూపుర్ శర్మ: ట్విట్టర్ వేదికగా ఆవేదన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇటీవల టీవీ చర్చలో ముహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నూపుర్ శర్మను బీజేపీ సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో నూపుర్ శర్మ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతోపాటు క్షమాపణలు కూడా చెప్పారు.

'నా మాటలు ఎవరికైనా అసౌకర్యాన్ని కలిగించినా లేదా ఎవరికైనా మతపరమైన భావాలను గాయపరిచినట్లయితే, నేను బేషరతుగా నా ప్రకటనను ఉపసంహరించుకుంటాను. ఎవరి మతపరమైన భావాలను దెబ్బతీయడం నా ఉద్దేశ్యం కాదు' అని నూపుర్ శర్మ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Take my words back: BJPs Nupur Sharma after suspension over remarks on Prophet

'గత చాలా రోజులుగా మా మహాదేవ్‌ను అవమానిస్తున్నారని, అగౌరవపరిచారని నేను టీవీ చర్చలకు హాజరవుతున్నాను. ఇది శివలింగం కాదు [జ్ఞానవాపి మసీదు వద్ద] ఫౌంటెన్ అని ఎగతాళిగా చెబున్నారు. ఢిల్లీలోని రోడ్డు పక్కన ఉన్న గుర్తులు, స్తంభాలతో పోల్చడం ద్వారా కూడా ఎగతాళి చేస్తున్నారు' అని నూపుర్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.

'మా మహాదేవ్‌పై ఈ నిరంతర అవమానాన్ని, అగౌరవాన్ని నేను సహించలేకపోయాను. దానికి ప్రతిస్పందిస్తూ నేను కొన్ని విషయాలు చెప్పాను' అని నూపుర్ శర్మ తెలిపారు.

బీజేపీ నుంచి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ సస్పెండ్

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆదివారం నాడు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. మహమ్మద్ ప్రవక్త ‌పై శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు బీజేపీ సంబంధం లేదని ప్రకటించిన అనంతరం ఈ మేరకు చర్య తీసుకుంది.

ఏ వర్గాన్ని లేదా మతాన్ని అవమానించే లేదా కించపరిచే భావజాలానికి పార్టీ తీవ్రంగా వ్యతిరేకమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
అలాంటి వ్యక్తులకు లేదా సిద్ధాంతాలకు బీజేపీ మద్దతు ఇవ్వదని ఆయన అన్నారు.

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాన్ని ఆచరించడానికి, ప్రతి మతాన్ని గౌరవించే హక్కును కల్పించిందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నారు.

"భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, భారతదేశాన్ని అందరూ సమానులుగా, ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవించే గొప్ప దేశంగా మార్చడానికి మేము కట్టుబడి ఉన్నాము, ఇక్కడ అందరూ భారతదేశ ఐక్యత, సమగ్రతకు కట్టుబడి ఉంటారు, ఇక్కడ అందరూ అభివృద్ధి, అభివృద్ధి ఫలాలను అనుభవిస్తారు అని ఆయన వెల్లడించారు.

గత వారం టీవీ చర్చలో నుపుర్ శర్మ ప్రవక్తను అవమానించేలా చేసిన వ్యాఖ్య ముస్లిం సమూహాల నుంచి భారీ నిరసన వ్యక్తమైంది. అంతకుముందు శుక్రవారం శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత మార్కెట్లను మూసివేయాలని పిలుపునిచ్చి క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో జరిగిన ఘర్షణల్లో 20 మంది పోలీసు సిబ్బందితో సహా కనీసం 40 మంది గాయపడ్డారు.

కాన్పూర్‌లో ఘర్షణలు జరిగినప్పుడు ఘటనా స్థలానికి 80 కిలోమీటర్ల దూరంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ ఓ కార్యక్రమంలో ఉన్నారు.

English summary
BJP Suspends Nupur Sharma, Naveen Jindal From Primary Membership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X