వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడ్డంకులు సృష్టించబోమని తీర్మానం: కాంగ్రెస్‌కు మోడీ సూచన

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలోనైనా పార్లమెంట్ సక్రమంగా జరిగేందుకు తాము సహకరిస్తామని తీర్మానం చేసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీకి సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వేకు గురువారం ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగపోవడం నిజంగా దృష్టకరమన్నారు. 60 ఏళ్ల పాటు అధికారాన్ని ఎంజాయ్ చేసిన కాంగ్రెస్, దేశ అభివృద్ధి విషయంలో తనకు ఏం తెలియనట్లు వ్యవహరించడం సరికాదని అన్నారు.

అడ్డంకులు సృష్టించబోమని తీర్మానం: కాంగ్రెస్‌కు మోడీ సూచన

అడ్డంకులు సృష్టించబోమని తీర్మానం: కాంగ్రెస్‌కు మోడీ సూచన

ఇప్పటికైనా పార్లమెంట్‌ సజావుగా జరిగేందుకు సహకరిస్తామని కొత్త సంవత్సరంలో తీర్మానం చేసుకోవాలని ఎద్దేవా చేశారు. 'రేపు జనవరి 1. కొత్త సంవత్సర వేడుకలకు వెళ్లే ముందు గట్టిగా ప్రమాణం చేయండి. మేం పార్లమెంటును సజావుగా జరగనిస్తామని, దేశ అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని' అని మోడీ పేర్కొన్నారు.

అడ్డంకులు సృష్టించబోమని తీర్మానం: కాంగ్రెస్‌కు మోడీ సూచన

అడ్డంకులు సృష్టించబోమని తీర్మానం: కాంగ్రెస్‌కు మోడీ సూచన

'లోక్‌సభ ప్రారంభమైనప్పటి నుంచి నాకు సరిగా మాట్లాడే అవకాశమే రావడం లేదు. అందుకే నేను జనసభల్లో మాట్లాడుతున్నాను. ప్రజలు మనల్ని పార్లమెంటుకు పంపించింది చర్చించడానిని, నిర్ణయాలు తీసుకోవడానికి, అన్నీ పెండింగ్‌లో పెట్టడానికి కాదు, సభా సమయాన్ని వృథా చేసేందుకు కాదు' అని ఆయన అన్నారు.

అడ్డంకులు సృష్టించబోమని తీర్మానం: కాంగ్రెస్‌కు మోడీ సూచన

అడ్డంకులు సృష్టించబోమని తీర్మానం: కాంగ్రెస్‌కు మోడీ సూచన

ఈ ప్రాజెక్టు పూర్తయితే ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ వాసులు ట్రాఫిక్ కష్టాలు తీరతాయన్నారు. రూ. 7,500 కోట్ల భారీ వ్యయంతో ఢిల్లీ-మీరట్‌ మధ్య 14 లైన్లతో ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తున్నామన్నారు.

అడ్డంకులు సృష్టించబోమని తీర్మానం: కాంగ్రెస్‌కు మోడీ సూచన

అడ్డంకులు సృష్టించబోమని తీర్మానం: కాంగ్రెస్‌కు మోడీ సూచన

ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్‌కు ఓ విజ్ఞప్తి చేశారు. గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షలకు ఇంటర్యూలు నిర్వహించవద్దని, మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు పొందేలా అవకాశం కల్పించాలన్నారు.

English summary
Speaking on the eve of the New Year, Modi urged India's Grand Old Party, which has ruled the nation for 60 years, to "understand its responsibilities" and not "destroy" the institution of Parliament, standing as an impediment in nation's growth, development, creation of jobs and welfare of poor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X