చింతగింజల అమ్మకంతో కలాం తొలి సంపాదన
చెన్నై: గుండెపోటుతో సోమవారం రాత్రి తుది శ్వాస విడిచిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం (అవుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం) స్వగ్రామం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని రామేశ్వరం. కలాం చిన్నతనం నుంచే కష్టజీవిగా జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన తొలి సంపాదన ప్రారంభమైంది చింతగింజల అమ్మకం ద్వారానే కావడం గమనార్హం.
రామేశ్వరం ఊరిని ఆనుకొనే ఉన్న సముద్రం అంటే ఆ ఆయనకు చాలా ఇష్టం. తీరంలో కూర్చొని ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసి తాను కూడా అలా ఎగరాలని ఆశపడేవాడు. అబ్దుల్ కలాం... 1931 అక్టోబర్ 15న జన్మించారు. జైనులబ్దీన్, ఆషియమ్మా.. కలాం తల్లిదండ్రులు. నిరుపేద కుటుంబం. దీంతో తెల్లవారుజామునే లేచి ఇంటింటికీ పేపర్ వేసేవారు.
అంతకు ముందు చింతగింజలు సేకరించి అమ్మడం ద్వారా తొలి సంపాదన సంపాదించారు. ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే చురుకైన కుర్రాడిగా పేరు తెచ్చుకున్నారు. తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో 1954లో భౌతికశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు.

కాగా, కలాంకు.. తమ ఊరిలోని లక్ష్మణశాస్త్రి అంటే అమిత గౌరవం. కలాం ఐదో తరగతి చదువుతుండగా.. ఆ పాఠశాలకు కొత్త టీచర్ వచ్చారు. ఓ బ్రాహ్మణ బాలుడి పక్కన కలాం కూర్చొని ఉండటంతో ‘బ్రాహ్మణ బాలుడి పక్కన ముస్లిం కూర్చోవడమేంటి?' అంటూ కలాంను వెనక కూర్చోమని ఆదేశించారు. ఇది తెలుసుకున్న ఆ బాలుడి తండ్రి లక్ష్మణశాస్త్రి. టీచర్‌ను చీవాట్లు పెట్టారు. ఈ నేపథ్యంలో కలాంకు లక్షణశాస్త్రిపై అభిమానం పెరిగింది.
ఇది ఇలా ఉండగా, ‘వ్యవస్థను మార్చాలనుకుంటే.. అవాంతరాలను అధిగమించాల్సిందే' తన చిన్ననాటి గురువు శివ సుబ్రమణ్యం అయ్యర్ చెప్పిన మాటలే.. తనను అత్యున్నత శిఖరాలకు చేర్చాయని అనేక సందర్భాలలో కలాం గుర్తుచేసుకునేవారు. స్కూల్లో చదువుతున్నప్పుడు.. తన ఇంటికి భోజనానికి రావాలని సుబ్రమణ్యం కలాంను ఆహ్వానించారు.
గత అనుభవాలతో కలాం సంకోంచించారు. దీంతో సుబ్రహ్మణ్యం స్వయంగా ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టారు. ప్రపంచమంతా చుట్టివచ్చినా.. జన్మస్థలమైన రామేశ్వరమంటే కలాంకు ఎనలేని మమకారం. చిన్నప్పుడు తన మాతృమూర్తితో కలిసి ఎక్కడైతే కూర్చొని భోజనం చేసేవారో... రాష్ట్రపతి అయిన తరువాత కూడా అదే నేలపై కూర్చొని తినేవారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications