పవన్ కు పోటీగా బరిలోకి స్టార్ హీరో..!!

జాతీయ స్థాయి లో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల పైన బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. జమిలి దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ ఈ సారి ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ గెలుపే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం పవన్ కల్యాణ్ ను అస్త్రంగా ప్రయోగిస్తోంది. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ నినాదంతో పవన్ జాతీయ స్థాయిలో మద్దతు సాధించారు. ఇప్పుడు తమిళనాడు, కేరళలో పవన్ పర్యటన చేస్తున్నారు. ఇదే సమయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

తమిళనాట బీజేపీ పవన్ అస్త్రం
బీజేపీ కేంద్ర నాయకత్వానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ మినహా మరెక్కడా పట్టు చిక్కటం లేదు. దీంతో, పవన్ కు ఉన్న సినీ గ్లామర్ తో పాటుగా సనాతన హిందూ ధర్మం కాపాడటం కోసం పవన్ తీసుకున్న నినాదం పైన దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఆరెస్సెస్ ముఖ్యులతో సహా పలు హిందూ సంస్థలు పవన్ కు మద్దతు ప్రకటించాయి. తిరుపతిలో గతంలో నిర్వహించిన వారిహి సభ లో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అప్పటికే చేసిన వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడు, కేరళలో ప్రముఖ ఆలయాల సందర్శన ద్వారా తన లక్ష్యం లో తొలి అడుగు వేసారు.

Tamil Actor-turned-politician Kamal Haasan is likely to be nominated for a Rajya Sabha by DMK

మారుతున్న రాజకీయం
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా పవన్ కూటమి గెలుపు కోసం ఇప్పటికే నుంచే రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ ముఖ్యుల సూచన మేరకే పవన్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. అటు సినీ హీరో విజయ్ పాలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సూచనలతో ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఇటు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే తిరిగి అధికారం నిలబెట్టుకొనేందుకు కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా సీఎం స్టాలిన్ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. మక్కల్ నిది మయ్యమ్ (ఎమ్ఎన్‌ఎమ్) పార్టీ అధినేత, విశ్వనటుడు కమల్ హాసన్‌ను అధికార డీఏంకే పార్టీ రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు సమాచారం.

రాజ్యసభ కు కమల్ హాసన్
తన ప్రతిపాదన గురించి మంత్రి మంత్రి శేఖర్ బాబు ద్వారా కమల్ హాసన్‌కు సమాచారం పంపా రు. ఈ ఏడాది జులైలో డీఏంకే పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పదవి కాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్‌ను పెద్దల సభకు పంపేందుకు డీఏంకే నిర్ణయం తీసు కుంది. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో డీఏంకేతో మక్కల్ నిది మయ్యమ్ పొత్తు పెట్టుకొం ది. ఆ ఎన్నికల్లో కోయంబత్తురు నుంచి కమల్ హాసన్ బరిలో నిలవాలని భావించారు. అక్కడ నుంచి బీజేపీ అభ్యర్దిగా అన్నామలై బరిలోకి దిగారు. దీంతో సీఎం స్టాలిన్ అభ్యర్ధన మేరకు కమల్ హాసన్ బరి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు రాజ్యసభకు నామినేట్ చేయాలని నిర్ణయించారు. అటు బీజేపీ పవన్ తో సహా మిత్రపక్షాలను తమిళనాడులో మొహరిస్తున్న వేళ.. ఇప్పటి నుంచే స్టాలిన్ తన ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+