స్థానిక సంస్థల ఎన్నికల్లో స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్: రాజకీయ ఎంట్రీకి రంగం సిద్ధం
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. కమల్ హాసన్ తరువాత మరో స్టార్ హీరో రాజకీయాల్లో అడుగు పెట్టడానికి దాదాపుగా రంగం సిద్ధమైనట్టే. దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్- రాజకీయ పార్టీని సైతం ప్రకటించినప్పటికీ ఆ తరువాత అనూహ్యంగా వెనుకడుగు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనను ఉపసంహరించుకున్నారు. దీనికి ఆయన ఆరోగ్య పరిస్థితులు ప్రధాన కారణంగా అప్పట్లో వార్తలొచ్చాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో..
ఇప్పుడు తాజాగా మరో మాస్ హీరో ఇళయదళపతి విజయ్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. దీనికి సన్నాహాకంగా ఆయన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలను వేదికగా చేసుకున్నారు. తమిళనాడులో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ అభిమాన సంఘాలు పోటీ చేయబోతోన్నాయి. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగబోతోండటం అందరి దృష్టినీ ఆకర్షించింది.

విజయ్ మక్కల్ ఇయకం పేరుతో..
కమాండర్ విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (థలపతి విజయ్ మక్కల్ ఇయకం) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని విజయ్ అభిమాన సంఘాల నాయకులు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకుంటోన్నారు. తాము అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తామని విజయ్ మక్కల్ ఇయకం నాయకుడు ఎన్ ఆనంద్ తెలిపారు. దీనికి విజయ్ నుంచి ఆమోదం లభించిందని అన్నారు.

స్వతంత్రంగా బరిలో..
ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవట్లేదంటూ ఆనంద్ స్పష్టం చేశారు. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే, కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీథి మయ్యం.. ఇలా ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా తామందరం స్వతంత్రంగా పోటీ చేయబోతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తాము ఎదుగుతామని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభిమానులకు ప్రజల మద్దతు ఉందని చెప్పారు. విజయ్ ఫొటోతోనే వారు ఎన్నికల్లో పోటీ చేస్తారని ఎన్ ఆనంద్ తెలిపారు.

గెలిపించాలంటూ..
స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో తన అభిమాన సంఘాల నాయకులు పోటీ చేయడానికి విజయ్ కూడా అంగీకరించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అభిమానులు పోటీ చేస్తున్నారని, వారికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కమాండర్ విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌కు మరే ఇతర పార్టీతోనూ సంబంధాలు లేవని, ఎలాంటి పొత్తు లేదని తేల్చిచెప్పారు. నగరాల నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న అభిమానులు వారిని గెలిపిస్తారని అన్నారు.
Recommended Video

గత ఏడాదిలో..
గత సంవత్సరం అక్టోబర్‌లో తొమ్మిది జిల్లాల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. దళపతి విజయ్ మక్కల్ ఇయకం నుంచి 169 మంది అభిమానులు పోటీ చేశారు. వారిలో 115 మంది విజయాన్ని సాధించారు. మక్కల్ నీథి మయ్యం కంటే ఎక్కువ స్థానాలను గెలిచారు. అదే ఊపుతో మలివిడత స్థానిక సంస్థల ఎన్నికలకు వారంతా సమాయాత్తమౌతున్నారు. ఈ సారి మరిన్ని స్థానాలను దక్కించుకునే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications