వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశ్వాసఘాతకుడు, స్థానికేతరుడైన రజనీని ఎలా స్వాగతిస్తాం: డైరెక్టర్ భారతీ రాజా సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

రజనీ విశ్వాసఘాతకుడు.. డైరెక్టర్ భారతీ రాజా సంచలనం..!

చెన్నై: స్థానికేతరుడైన రజనీకాంత్ తమను పాలిస్తే స్వాగతించే స్థితిలో తాము లేమని తమిళ దర్శకుడు భారతీ రాజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బిజెపి రజనీకాంత్‌ను రంగంలోకి దింపుతోందని ఆయన ఆరోపించారు.వయస్సు అయిపోయాక రాజకీయాలంటూ వచ్చారని రజనీకాంత్, కమల్‌హసన్‌పై ఆయన విమర్శలు గుప్పించారు.

తమిళ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో రెండు కొత్త పార్టీలు బరిలోకి దిగనున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు మరో నటుడు కమల్ హసన్ కూడ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.

అయితే ఈ ఇద్దరు నటులు కొత్తగా రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి పోటీ చేస్తామని ప్రకటించడం ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది.అయితే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశంపై కొందరు మరోసారి విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళ దర్శకులు భారతీరాజా, సీమాన్ లు సినీ నటులు రజనీకాంత్, కమల్‌

 స్థానికేతరుడైన రజనీకాంత్ పాలనను ఎలా స్వాగతిస్తాం

స్థానికేతరుడైన రజనీకాంత్ పాలనను ఎలా స్వాగతిస్తాం

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్థానికేతరుడని తమిళ దర్శకులు భారతీ రాజా, సీమానాలు తీవ్ర విమర్శలు గుప్పించారు. స్థానికేతరుడైన రజనీకాంత్ తమను పాలించడాన్ని ఎలా స్వాగతిస్తామని భారతీ రాజా , సీమాన్ లు ప్రశ్నించారు. తమను పాలించేందుకు స్థానికేతరుడైన రజనీకాంత్‌ను ఎలా సమర్థిస్తామని వారు ప్రశ్నించారు.

విశ్వాస ఘాతుకానికి నిలువెత్తు నిదర్శనం

విశ్వాస ఘాతుకానికి నిలువెత్తు నిదర్శనం

రజనీకాంత్ విశ్వాసఘాతుకానికి నిలువెత్తు నిదర్శనమని తమిళ దర్శకులు భారతీ రాజా, సీమాన్ విమర్శలు చేశారు. రజనీకాంత్ ‌ను అడ్డుపెట్టుకొని కొన్ని పార్టీలు ప్రయోజనం పొందాలని చూస్తున్నాయని భారతీ రాజా ఆరోపించారు. ఈ రకమైన ఎత్తులు తమిళనాడులో పని చేయవన్నారు.

 రజనీకాంత్‌తో బిజెపి ఎత్తులు

రజనీకాంత్‌తో బిజెపి ఎత్తులు

నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బిజెపి రజనీకాంత్‌ను తెరమీదికి తెచ్చిందని తమిళ దర్శకులు భారతీ రాజా, సీమాన్ లు విమర్శించారు. బిజెపి స్వతంత్రంగా పోటీ చేస్తే తమిళ ప్రజలు పట్టం కట్టరనే ఉద్దేశ్యంతో రజనీకాంత్‌ను ముందు పెట్టారని వారు ఆరోపించారు. బిజెపి వ్యూహత్మకంగా ఈ ప్రయత్నాలు చేస్తోందని వారు ఆరోపించారు.

 జయలలిత మరణం, కరుణ అనారోగ్యం

జయలలిత మరణం, కరుణ అనారోగ్యం

జయలలిత మరణించడంతో పాటు , డిఎంకె చీఫ్ కరుణానిధి అనారోగ్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని వారు అభిప్రాయపడ్డారు. వయస్సులో ఉండగా హిమాయాల చుట్టూ తిరిగిన రజనీకాంత్ వయస్సు అయిపోయాక రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించారని వారు ఎద్దేవా చేశారు. వయస్సు అయిపోయాక సినిమాలు ఉండవనే ఉద్దేశ్యంతో రాజకీయాలంటూ బయలు దేరారని రజనీకాంత్, కమల్ హసన్‌పై వారు విమర్శలు గుప్పించారు.

English summary
Tamil director Bharatiraja made allegations cine actors Rajinikanth and Kamalhassan on Thursday. Bjp is playing key role behind Rajinikanth he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X