పునీత్ సమాధిని చూడగానే - హీరో సూర్య ఎమోషనల్ : అప్పును తలచకుంటూ కన్నీటి పర్యంతం..!!

కన్నడ పవర్ స్టార్ ను తలచుకుంటూ...అప్పుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తమిళ హీరో సూర్య కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన బెంగుళూరు వెళ్లి పునీత్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇక శివరాజ్ కుమార్‏తో కలిసి.. పునీత్ సమాధి వద్దకు వెళ్లారు. ఆయమ సమాధికి పూలమాల వేసి నివాళులర్పించారు. పునీత్ సమాధిని చూడగానే.. హీరో సూర్య ఎమోషనల్ అయ్యారు. సమాధి వద్దే నిల్చోని కన్నీళ్లు పెట్టుకున్నారు. ''పునీత్‌ హఠాన్మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేసారు. పునీత్‌ ఇక లేరన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నానన్నారు.

కడుపులో ఉన్నప్పుడే స్నేహితులం

కడుపులో ఉన్నప్పుడే స్నేహితులం

మా కుటుంబాల మధ్య మంచి స్నహం ఉంది. మా నాన్న, రాజ్‌కుమార్‌ కుటుంబంతో సమయం గురించి తరచూ చెబుతుండేవారు. పునీత్‌ అమ్మగారు.. మా అమ్మ ఇద్దరూ గర్బిణీలుగా ఉన్న సమయంలో మొదటిసారి కలిశారట. అలా మేము అమ్మ కడుపులో ఉండగానే కలుసుకున్నాం. వాళ్లు కూడా పునీత్‌ చనిపోయాడన్న విషయాన్ని నమ్మలేకపోతున్నారు. తను చేసిన మంచి పనులు, తన జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. అయితే తనను చాలా మిస్‌ అవుతా'' అని సూర్య అన్నారు.

జీర్ణించుకోలేక పోతున్న అభిమానులు

జీర్ణించుకోలేక పోతున్న అభిమానులు

పునీత్ అకాలమరణించారనే వార్తను అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.. సోషల్ మీడియాలో పునీత్ రాజ్ కుమార్ రేర్ ఫోటోస్.. వీడియోస్ మాత్రమే కాకుండా.. వివిధ రకాలుగా ఆయన నివాళులర్పిస్తున్నారు. పునీత్ కుటుంబసభ్యులను వరుసగా తెలుగు, తమిళ్ హీరోలు వెళ్లి పరామర్శిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున, రామ్ చరణ్ పునీత్ సమాధిని సందర్శించి.. ఆయన కుటుంబసభ్యులకు దైర్యం చెప్పారు. తాజాగా ఈరోజు తమిళ్ స్టార్ హీరో సూర్య పునీత్ సమాధిని సందర్శించారు.

సూర్య ఎమోషనల్...నివాళి

సూర్య ఎమోషనల్...నివాళి

జైభీమ్ సినిమా విడుదల సందర్భంగా బిజీగా ఉన్న సూర్య పునీత్ అంత్యక్రియలకు హజరుకాలేకపోయారు. సూర్య అప్పు సమాధి వద్ద నివాళి అర్పించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అప్పు మరణ వార్త తెలిసిన వెంటనే టాలీవుడ్ సైతం విషాదంలో మునిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, శ్రీకాంత్, రాణా, ఆలీ, పలువురు నిర్మాతలు అప్పు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. బాలయ్య ఆ కుటుబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని తలచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. లక్షలాది అభిమానులు పెద్ద సంఖ్యలో ఇప్పటికీ అప్పు సమాధి సందర్శనకు తరలి వస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+