Oxygen shortage: మరో ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం: 11 మంది మృతి

చెన్నై: కరోనా సంక్షోభం భారత్‌ను అతలాకుతలం చేస్తోంది. అల్లకల్లోలానికి గురి చేస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో నమోదవుతోన్న పాజిటివ్ కేసులతో ఆక్సిజన్ సహా వైద్య సదుపాయాల కొరతను ఎదుర్కొంటోంది. ఆక్సిజన్ కొరత అన్ని రాష్ట్రాలనూ వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తోన్నప్పటికీ.. ఆక్సిజన్ లోటు భర్తీ కావట్లేదు. 33 లక్షల వరకు ఉన్న కరోనా బారిన పడిన పేషెంట్లలో చాలామందికి ఈ ప్రాణవాయువు అవసరమౌతోంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా ఉండట్లేదు.

కర్ణాటకలో ఆక్సిజన్ అందక 24 మంది పేషెంట్లు మృత్యువాత పడిన ఘటనను విస్మరించకముందే- అలాంటి ఉదంతమే తమిళనాడులో చోటు చేసుకుంది. చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో 11 మంది కరోనా పేషెంట్లు మృత్యువాత పడ్డారు. తొలుత అయిదుమంది మృతి చెందినట్లు సమాచారం అందింది. అనంతరం ఈ సంఖ్య 11కు చేరినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానిక అధికారులు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. కర్ణాటకలోని చామరాజనగర ఆసుపత్రిలో మూడురోజుల కిందట 24 మంది మృతిచెందారు.

Tamil Nadu: 11 died in Chengalpattu hospital due to Oxygen shortage

ఇలాంటి ఘ‌ట‌నే క‌ర్ణాట‌క‌లో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న‌ది. క‌ర్ణాట‌లోని చామరాజనగర్‌లో ఉన్న జిల్లా ద‌వాఖాన‌లో సోమ‌వారం తెల్ల‌వారుజామున ఆక్సిజ‌న్ అంద‌క‌పోవ‌డంతో 2 గంటల్లో 24 మంది రోగులు మృతి చెందారు. వీరిలో కొందరు కోవిడ్ పేషంట్లు కూడా ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సోమ‌వారం తెల్లవారుజామున 2 గంటల మధ్య వారు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

చాలినంత ఆక్సిజన్ అందుబాటులో ఉందని అధికారులు వివరణ ఇస్తున్నారు. సరఫరాలో లోపం చోటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సాంకేతిక కారణాల వల్ల ఈ ఘటన సంభవించి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒకేసారి 11 మంది పేషెంట్లు మృత్యువాత పడటంతో చెంగల్పట్టులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతుల బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. ఆందోళనకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+