శివకాశిలో భారీ పేలుళ్లు : గోడౌన్‌లో అగ్రి ప్రమాదంతో 8మంది మృతి
చెన్నై : ప్రపంచదేశాలకు టపాసులు సరఫరా చేసే కేంద్రంగా పేరొందిన శివకాశిలో మరో భారీ పేలుడు చోటు చేసుకుంది. బాణసంచా నిల్వచేసిన గోడౌన్ లో పెద్ద ఎత్తున పేలుళ్లు చోటు చేసుకోవడంతో.. ఎనిమిది మంది మరణించగా మరో పదిహేను మంది దాకా తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం.
గాయపడ్డ 15మందిలో 8మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శివకాశి శివార్లలో ఉన్న గోడౌన్ లో భారీ బాణా సంచా నిల్వ చేసి ఉండగా.. గురువారం మధ్యాహ్నాం ఒక్కసారిగా గోడౌన్ లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పేలుళ్ల ధాటికి మంటలు తీవ్రంగా వ్యాప్తించడంతో.. ఆ సమయంలో గోడౌన్ లో పనిచేస్తోన్న 30మంది పనివాళ్లు పరుగులు పెట్టారు.

అయితే అప్పటికే మంటలు వ్యాప్తించడంతో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 8మంది పరిస్థితి విషమంగా మారడంతో సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గొడౌన్ పక్కనే ఓ ప్రైవేటు కూడా ఉండడంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అందులోని రోగులందరినీ వేరే చోటుకు తరలించారు. కాగా, ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. శివకాశిలో తయారయ్యే బాణసంచాకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. దీంతో ప్రతీయేటా ఇక్కడినుంచి ప్రపంచదేశాలకు బాణసంచా ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం దీపావళి సీజన్ కావడంతో.. బాణసంచా విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. అయితే వాటిని నిల్వ చేసే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశముంది.












Click it and Unblock the Notifications