చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక్కరోజు ముఖ్యమంత్రికి బీజేపీ గాలం -నటుడు అర్జున్‌తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ -అంత లేదంటూ..

|
Google Oneindia TeluguNews

ఉత్తరాదిలో తమ గ్రాఫ్ క్రమంగా పడిపోతుండటంతో తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడం ద్వారా బలాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఎత్తులు వేస్తోంది. కొంత కాలంగా దక్షిణాదిలో పట్టుకోసం శ్రమిస్తోన్న కమలనాథులు.. అసెంబ్లీ ఎన్నికల సమయాన్ని కీలకంగా వాడుకుంటున్నారు. ఇప్పటికే కేరళలో 'మెట్రోమ్యాన్' శ్రీధరన్ సహా పలువురు మాజీ జడ్జిలు కాషాయ తీర్థం పుచ్చుకోగా, తమిళనాడులోనూ సెలబ్రిటీలకు బీజేపీ గాలం వేస్తోంది. ఈ క్రమంలో..

కిషన్ -అర్జున్ భేటీ!

కిషన్ -అర్జున్ భేటీ!


ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు.. తమిళనాడుకు భారీగా తాయిలాలు ప్రకటించడం, అక్కడి అధికార పార్టీ అన్నాడీఎంకేతో పొత్తు కూడా పెట్టుకోవడం తెలిసిందే. తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇంచార్జిగా దూసుకుపోతోన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా సినీ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ తో భేటీ అయినట్లు సమాచారం. ఆ సమావేశంలో..

సోనోవాల్‌కు బీజేపీ హైకమాండ్ షాక్ -సిట్టింగ్ సీఎంపై అపనమ్మకం -ఫలితాల తర్వాతే పేరు ప్రకటనసోనోవాల్‌కు బీజేపీ హైకమాండ్ షాక్ -సిట్టింగ్ సీఎంపై అపనమ్మకం -ఫలితాల తర్వాతే పేరు ప్రకటన

తమిళ బీజేపీ చీఫ్‌తో కలిసి

తమిళ బీజేపీ చీఫ్‌తో కలిసి

చాలా రోజులుగా చెన్నైలోనే మకాం వేసిన కిషన్ రెడ్డి.. అన్నా డీఎంకేతో సీట్ల సర్దుబాటు అంశంతోపాటు ప్రచార వ్యూహాలనూ రచిస్తున్నారు. అర్జున్ తో భేటీకి కిషన్ రెడ్డితోపాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్ మురుగన్ కూడా వెళ్లారని, బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేయాల్సిందిగా హీరోను కిషన్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను అర్జున్ సున్నితంగా తిరస్కరించారని సమాచారం. నిజానికి..

viral video:అశోక్ సారు కొట్టలేదు -మంటల నుంచి కాపాడారు -టీడీపీ మహిళా కార్యకర్త వివరణviral video:అశోక్ సారు కొట్టలేదు -మంటల నుంచి కాపాడారు -టీడీపీ మహిళా కార్యకర్త వివరణ

అంత టాలెంట్ లేదన్న అర్జున్

అంత టాలెంట్ లేదన్న అర్జున్

ఎన్నికల వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ కావడానికి కొద్దిరోజుల ముందే హీరో అర్జున్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదని, తన స్వభావం, ఆలోచన విధానం రాజకీయాలకు ఏ మాత్రం సరిపడవని, రాజకీయాలు చేసేంత టాలెంట్ తనలో లేదని అర్జున్ కరాఖండిగా చెప్పారు. ఒకే ఒక్కడు సినిమాలో ఒక్క రోజు సీఎం తరహాలో సమాజ హితం కోసం నిజంగానే ఎందుకు ప్రయత్నించకూడదు? అని అభిమానులు అడిగిన ప్రశ్నలకు.. ''అలాంటివన్నీ సినిమాల్లో మాత్రమే సాధ్యం. నిజ జీవిత రాజకీయాల్లో అది ఇప్పటికైతే సాధ్యం కాదు''అని అర్జున్ గతంలో ఓసారి బదులిచ్చారు.

English summary
The Bharatiya Janata Party, which is formulating strategies for proper entry in Tamil Nadu, has focused on several celebrities. Tamil Nadu BJP election in-charge, Union Minister Kishan Reddy seems to have recently met actor Arjun. It is learned that Arjun refused to campaign on behalf of the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X