షాక్: పన్నీర్ సెల్వంకు చెక్ ? కేబినేట్ అత్యవసర సమావేశం
తమిళనాడు రాష్ట్ర కేబినేట్ అత్యవసరం సమావేశం బుధవారం ఉదయం సీఎం పన్నీర్ సెల్వం నేతృత్వంలో మొదలైయ్యింది. అన్నాడీఎంకే పార్టీ చీఫ్ నెచ్చెలి శశికళ ముఖ్యమంత్రి కావాలని నినాదాలు .
చెన్నై: తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బుధవారం తమిళనాడు రాష్ట్ర కేబినేట్ అత్యవసరం సమావేశం నిర్వహించారు. ఉదయం 9.30 గంటల సమయంలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు.
షాక్.. శశికళ తమిళనాడు సీఎం: జయలలిత మేనళ్లుడు దీపక్
అన్నాడీఎంకే పార్టీ చీఫ్ నెచ్చెలి శశికళ ముఖ్యమంత్రి కావాలని నినాదాలు ఎక్కువ అయిన నేపథ్యంలో నిర్వహిస్తున్న మంత్రి వర్గ సమావేశంలో కీలకనిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇదే సమయంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో శశికళ పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. బుధవారం తాడోపేడో తేల్చుకోవాలని సీఎం పన్నీర్ సెల్వం నిర్ణయించారని ఆయన వర్గీయులు అంటున్నారు.
ఇదే సమయంలో డీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. ఉదయం చెన్నైలోని అన్నా ఆరివాలయంలోని డీఎంకే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు ఒకే రోజు సమావేశం ఏర్పాటు చెయ్యడంతో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.
మీకో దండం: పన్నీర్ సెల్వం రాజీనామా ? శశికళ చేతిలో లేఖ
రాష్ట్ర కేబినేట్ సమావేశం పూర్తి అయిన తరువాత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మీడియాతో ఏమి మాట్లాడుతారో ? అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదే మంత్రి వర్గ సమావేశంలో శశికళ సీఎం కావాలని నిర్ణయం తీసుకుంటారా ? లేదా ? అనే విషయం తెలిసిపోతుందని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications