కాన్వోయ్ లేదు, సెక్యూరిటీ లేదు: ట్రాఫిక్‌లో చిక్కుకున్న పన్నీరుసెల్వమ్
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రోడ్డుపైకి వచ్చారు. ఇక సాధారణ వ్యక్తిలానే ఆయన కూడా రోడ్డెక్కి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన సీఎంను చూసి వాహనదారులు అవాక్కయ్యారు.
చెన్నై: సాధారణంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే.. ఆ మార్గంలో ట్రాఫిక్‌ను నిలిపేసి ఆయనకు దారివ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు తమిళనాడులో కూడా ఇలాంటే పరిస్థితే ఉండేది. కానీ, పన్నీరుసెల్వమ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అందుకు వ్యతిరేకంగా మారిపోయింది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రోడ్డుపైకి వచ్చారు. ఇక సాధారణ వ్యక్తిలానే ఆయన కూడా రోడ్డెక్కి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన సీఎంను చూసి వాహనదారులు అవాక్కయ్యారు.
వార్ధా తుపాను ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు రంగంలోకి దిగిన పన్నీర్ సెల్వం ప్రజలను మరిన్ని ఇబ్బందులకు గురిచేయడం ఇష్టం లేక కాన్వాయ్‌ను, సెక్యూరిటీని పక్కనపెట్టారు.

ఈ క్రమంలో గురువారం సహాయక చర్యలను పర్యవేక్షించి తిరిగి వస్తుండగా నందనంలోని చామియర్స్ రోడ్డులో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. 15 నిమిషాల పాటు చిక్కుకుపోయి ట్రాఫిక్ కష్టాలను అనుభవించారు.
కాగా, ట్రాఫిక్‌లో తమతోపాటు చిక్కుకున్న ముఖ్యమంత్రిని చూసేందుకు వాహనదారులు ఆసక్తి చూపారు. తుఫాను కారణంగా చాలా సిగ్నిల్స్ దెబ్బతిన్న కారణంగానే ట్రాఫిక్ ఇబ్బందులు మరింత పెరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications