జయ పేపర్లు చదువుతున్నారట ? బెంగళూరు యువతి కోసం వేట

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలితపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను అన్నాడీఎంకే నాయకులు తిప్పికొడుతున్నారు. జయలలిత ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆమె పేపర్లు చదువుతున్నారని అన్నాడీఎంకే నాయకులు చెబుతున్నారు.

తమిళనాడు ఆర్థిక శాఖా మంత్రి పన్నీరు సెల్వంకు శాఖలు అప్పగించే విషయంపై జయలలితకు సందేశం పంపించామని, అందుకు అమ్మ సరే అన్నారని, ఆమె స్పృహలోనే ఉన్నారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీ.ఆర్. సర్వసతి చెప్పారు.

జయలలితకు ఇన్పెక్షన్ ఉన్న కారణంగా ఎవరినిపడితే వారిని లోపలికి అనుమతించడం లేదని, కేవలం వైద్యులు మాత్రం లోపలికి వెళ్లి ఆమెకు సందేశాలు వినిపిస్తున్నారని సీ.ఆర్. సరస్వతి వివరించారు.

అనుమానాలు ఉన్నాయి !

అనుమానాలు ఉన్నాయి !

జయలలిత తన శాఖలను పన్నీరు సెల్వంకు అప్పగించడానికి అంగీకరించారని చెప్పడంతో తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే చీఫ్ కరుణా నిధి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జయలలిత ఫైల్ మీద సంతకం చేశారా ? లేదా ? అనే అనుమానాలు అన్ని వర్గాల ప్రజలకు ఉందని మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి అన్నారు.

ఆయన చెప్పారా

ఆయన చెప్పారా

జయలలిత శాఖలు పన్నీరు సెల్వంకు అప్పగించాలని జయలలిత చెప్పడం ఎవ్వరూ నమ్మడం లేదని పీఎంకే అధినేత ఎస్. రామదాస్ అన్నారు. ఈ విషయంపై గవర్నర్ వివరించే వరకు అది అనుమానమే అన్నారు. జయలలితకు బయట నుంచి ఆక్సిజన్ సపోర్టు ఇస్తున్న సమయంలో ఆమె సంతకం చేయడం, తలాడించడం కూడా చేసి ఉండరని రామదాస్ చెప్పారు.

ఎవరు చెప్పారు

ఎవరు చెప్పారు

జయలలిత రోజు పేపర్లు చదువుతున్నారని డాక్టర్లు చెప్పలేదని, అయితే వారు చెప్పారని అన్నాడీఎంకే నాయకులు మీడియాకు చెబుతున్నారని అవన్ని అపద్దాలే అని ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. డాక్టర్లు చెప్పిన మాటే మీకు చెప్పామని, మీరు నమ్మకపోతే ఎవరేమి చేస్తారని సీ.ఆర్. సరస్వతి ఎదురు ప్రశ్నించారు.

లండన్ నుంచి డాక్టర్లు

లండన్ నుంచి డాక్టర్లు

లండన్ నుంచి డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే గురువారం చెన్నై చేరుకుని జయలలితకు చికిత్స చేయనున్నారు. గత నెల 22 నుంచి జయలలిత గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎన్ని రోజులు ఉంటారు

ఎన్ని రోజులు ఉంటారు

డాక్టర్ రిచర్డ్ రెండు సార్లు లండన్ నుంచి చెన్నై వచ్చి జయలలితకు చికిత్స చేశారు. ఇప్పుడు ఐదు రోజుల పాటు చెన్నైలోనే మకాం వేసి జయలలితకు మెరుగైన చికిత్స చేస్తారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. అయితే అపోలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రిచర్డ్ ఎన్నిరోజులు ఉంటారు అని అధికారికంగా దృవీకరించవలసి ఉంది.

అరెస్టు చేయండి

అరెస్టు చేయండి

తమిళనాడు సీఎం ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల వెనుక కొందరు రాజకీయ నేతలు ఉన్నారని కేంద్ర మంత్రి పొన్ రాధకృష్ణన్ ఆరోపించారు. ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు చేస్తే ఆ విషయాలు అన్ని వెలుగు చూస్తాయని కేంద్ర మంత్రి పొన్ రాధకృష్ణన్ చెప్పారు.

బెంగళూరు యువతి కోసం

బెంగళూరు యువతి కోసం

తమిళనాడు సీఎం జయలలితపై వాట్సాప్ లో అసత్య ప్రచారం చేసిన బెంగళూరుకు చెందిన యువతిని అరెస్టు చెయ్యడానికి చెన్నై పోలీసులు సిద్దం అయ్యారు. ఇప్పటికే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరుతో సహ ఇద్దరిని చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.

డాక్టర్లు, నర్సులకే అనుమతి

డాక్టర్లు, నర్సులకే అనుమతి

జయలలిత చికిత్స పొందుతున్న చోటకు వైద్యులు, నర్సులను మాత్రమే అనుమతి ఇస్తున్నారు. వేరే వారు లోపలికి వెళ్లి జయలలితను చూడటానికి అవకాశం ఇవ్వడం లేదని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.

మోకాలిపై నడిచాడు

మోకాలిపై నడిచాడు

తిరునల్వేలికి చెందిన మాడస్వామి అనే అన్నాడీఎంకే నాయకుడు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న వల్లియ మురగన్ దేవాలయం వరకు మోకాలిపై నడిచి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. జయలలిత త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించారు.

25 వేల మంది ఊరేగింపు

25 వేల మంది ఊరేగింపు

కోవైలో 25 వేల మంది మహిళలు పాల కలశాలతో ఊరేగింపుగా శక్తిమారియమ్మన్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. చెన్నై, మదురైలో కలశాలతో ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముస్లీం సోదరులు, క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+