జయలలిత జీవితంలో 45 ఏళ్ల తరువాత

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలితకు దిపావళి పండుగ చేదు అనుభవాన్ని మిగిల్చింది. జయలలిత అన్నాడీఎంకే మంత్రులు, అన్నాడీఎంకే కార్యకర్తలకు తన పోయెస్ట్ గార్డన్ లో స్వీట్లు పంచిపెట్టలేక, శుభాకాంక్షలు చెప్పలేకపోయారు.

జయలలిత సినీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న సమయంలో, రాజకీయంగా అధికారంలో ఉన్నా, లేకున్నా సాధారణంగా దీపావళి పండుగ జరుపుకునేవారు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమిళనాడు ప్రజలకు దిపావళి శుభాకాక్షంలు చెప్పి వారి ఆనందాన్ని తన ఆనందంగా భావించేవారు.

అనారోగ్యం

అనారోగ్యం

అనారోగ్యంతో బాధపడుతున్న జయలలిత సెప్టెంబర్ 22వ తేదీన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమెకు అపోలో, ఎయిమ్స్, లండన్, సింగపూర్ వైద్యులు చికిత్స చేశారు. ఆమె ఆరోగ్యం కుదటపడినా విశ్రాంతి చాల అవసరం అని వైద్యులు సూచించడంతో ఆసుపత్రిలోనే ఉన్నారు.

దీపావళికి ప్రత్యేక పూజలు

దీపావళికి ప్రత్యేక పూజలు

ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సందర్బంగా జయలలిత ఇంటి దగ్గరే ఉండేవారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆమె స్వయంగా స్వీట్లు పంచిపెట్టేవారు. దిపావళి రోజు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఇంటిలో ప్రత్యేక పూజలు చేసేవారు. అయితే ఈ దీపావళి పండుగ ఆమె జరుపుకోలేకపోయారు.

అమ్మ కోసం దిపావళికి దూరం

అమ్మ కోసం దిపావళికి దూరం

అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు ఈ సంవత్సరం దీపావళి పండగకు దూరంగా ఉన్నారు. జయలలిత ఆరోగ్యంగా తిరిగి ఇంటికి చేరుకున్న తరువాతే తాము దీపావళి పండుగ జరుపుకుంటామని అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు చెప్పారు.

ఆరోజుల్లో

ఆరోజుల్లో

1971లో జయలలిత సీనిరంగంలో బిజీస్టార్ గా ఉండేవారు. ఆసమయంలో ఆమె ఓవెలుగు వెలుగుతున్నారు. అదే సంవత్సరం జయలలిత తల్లి సంధ్యా తన ముద్దుల కుమార్తె కోసం మద్రాసు (చెన్నై)లోని రాధా సిల్స్క్ కు వెళ్లి 10 ప్రత్యేక పట్టు చీరులు తీసుకు వచ్చి ఇంట్లో పెట్టారు.

అమ్మ మీద మమకారం

అమ్మ మీద మమకారం

షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన జయలలితకు ఆమె తల్లి సంధ్యా పట్టు చీరలు ఇచ్చారు. మీరెందుకు కొత్త పట్టుచీరలు తీసుకోలేదు అని జయలలిత అమ్మను అడిగారు. నాకేందుకులే తల్లి అని ఆమె అనండంతో జయలలిత ఆలిగారు. వెంటనే రాధ సిల్స్క్ కు ఫోన్ చేసి 10 పట్టు చీరలు సిద్దంగా పెట్టాలని తాను వచ్చి తీసుకు వెలుతానని జయలలిత చెప్పారు.

పండుగ రోజూ పాత చీరే

పండుగ రోజూ పాత చీరే

జయలలిత 10 ఖరీదైన పట్టు చీరలు తీసుకు వచ్చి ఆమె అమ్మ సంధ్యాకు ఇచ్చారు. అయితే పండగ రోజు జయలలిత తల్లి సంధ్యా పాత పట్టు చీరనే కట్టుకున్నారు. పండగ రోజు తల్లి మీద కోపపడకూడదని జయలలిత భావించారు. మరుసటి రోజు ఎలాగైనా తన తల్లి దగ్గర పట్టుచీర కట్టించాలని నిర్ణయించారు.

దీపావళి మొదటి దెబ్బ ఇదే

దీపావళి మొదటి దెబ్బ ఇదే

దీపావళి మరసటి రోజు జయలలిత తల్లి సంధ్యా రక్తపు వాంతులు చేసుకుని కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే కొంత కాలం చికిత్స పొందిన సంధ్యా మరణించారు. తను తీసుకు వచ్చిన 10 పట్టు చీరలను తల్లి మృతదేహం మీద కప్పి బోరున విలపించారు.

అమ్మ కోసం రాత్రి అంతా

అమ్మ కోసం రాత్రి అంతా

జయలలిత తల్లి సంధ్యా కూడా మంచి నటి. సంధ్యా షూటింగ్ కు వెళ్లిన తరువాత ఆమె ఇంటికి ఎప్పుడు వస్తారా అని జయలలిత రాత్రి అంతా ఎన్నో సార్లు నిద్రలేకుండా ఎదురుచూశారు. అలాంటి తల్లి దూరం కావడంతో ఆమె చాల కాలం ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయారు.

ఇప్పుడు రెండో సారి దెబ్బ

ఇప్పుడు రెండో సారి దెబ్బ

ఆనాటి దీపావళి పండుగ జయలలితకు చేదు అనుభవం మిగిల్చింది. ఇప్పుడు సరిగ్గా 45 సంవత్సరాల తరువాత జయలలిత అన్నారోగ్యంతో దీపావళి పండుగ జరుపుకోలేకపోయారు. జయలలిత జీవితంలో రెండు సార్లు దీపావళి పండుగ చేదు అనుభవాన్ని మిగిల్చింది. తన తల్లి దగ్గర కొత్త పట్టుచీర కట్టించలేకపోయానని ఆమె ఆశ నెరవేరకుండానే పోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+