జయలలిత ఇంటి భోజనం తింటున్నారు !
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం సంపూర్ణంగా మెరుగుపడిందని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. ఇంటిలో రవ్వతో తయారు చేసిన కిచిడీని జయలలిత తింటున్నారని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు.
జయలలిత ఆసుపత్రిలో చేరి నేటికి 47 రోజులు అయ్యింది. ఆమె ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క్షేమంగా ఉన్నారని ఏఐఏడీఎంకే నాయకులు అన్నారు. జయలలిత చాల ఆరోగ్యంగా ఉన్నారని అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్.సి. రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.

సోమవారం ఆపోలో ఆసుపత్రి ఆవరణంలోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తరువాత జయలలితను ప్రత్యేక వార్డుకు మార్చుతున్నారని అన్నాడీఎంకే నాయకులు చెప్పారు.
జయలలిత ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, ఆమె స్వయంగా తన బెడ్ మీద కుర్చుంటున్నారని, ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్వాసతీసుకుంటున్నారని అన్నాడీఎంకే నాయకులు అన్నారు. జయలలిత మరో 10 రోజుల్లో ఇంటికి చేరుకుని ఎప్పటిలాగే ప్రజాసేవ చేస్తారని అన్నాడీఎంకే నాయకులు తెలిపారు.












Click it and Unblock the Notifications