పన్నీర్ కు టైట్ సెక్యూరిటీ, బాడీగార్డ్స్: మన్నార్ గుడి గ్యాంగ్ తో ముప్పు !
చెన్నై: తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు భారీ భద్రత కల్పించారు. అన్నాడీఎంకే పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోవడంతో తమిళనాడులో రాజకీయాలు వెడెక్కాయి. శశికళ వర్గంలోని మన్నార్ గుడి గ్యాంగ్ ఆగడాలు ఇంతా అంతా కాదు అన్న విషయం తెలిసిందే.
తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు శశికళ వర్గంలోని మాఫియా గుడి గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎక్కువ అయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి పన్నీర్ సెల్వంకు అదనంగా 10 మందికి పైగా ప్రత్యే శిక్షణ తీసుకున్న బాడీగార్డులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు భద్రత కల్పించారు.

పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మొహరిస్తున్నాయి. పన్నీర్ సెల్వం ఎక్కడికి వెళ్లినా శశికళ అనుచరుల నుంచి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని గ్రహించిన ఉన్నతాధికారులు ప్రత్యేకంగా 10 మందికి పైగా బాడీగార్డుతో సహ పోలీసు అధికారులు భద్రత కల్పిస్తున్నారు.
పన్నీర్ సెల్వం ఎక్కడికి వెళ్లినా వీరు వెంట వెలుతున్నారు. పన్నీర్ సెల్వంను కలవడానికి వచ్చే వారిని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శశికళ అనుచరుల నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ఎలాంటి హాని జరకుండా చూడటానికే భద్రత పెంచామని ఉన్నతాధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications