శశికళను పన్నీరు సెల్వం టార్గెట్ చేశారా?
చెన్నై: తమిళనాడు ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత పదిలంగా ఉన్నారు. జయలలిత ప్రాణ స్నేహితురాలు నెచ్చెలి శశికళను ఆ రాష్ట్ర సీఎం పన్నీరు సెల్వం ధిక్కరించడానికి సిద్దం అయ్యారని, అయితే తామూ చూస్తూ ఊరుకోమని ఆమె అనుచరులైన శాసన సభ్యులు అంటున్నారు.
అన్నాడీఎంకే పార్టీలో జయలలిత అమ్మ, శశికళ చిన్నమ్మ. ఇంతకాలం అందరూ అలాగే అనుకుంటూ ముందుకు వెళ్లాం. ఈ విషయం అమ్మ జయలలితకు కూడా తెలుసు అని వారు చెబుతున్నారు. జయలలిత ఆశీర్వాధం, శశికళ అండతో పన్నీరు సెల్వం మూడు సార్లు సీఎం అయ్యారని అన్నారు.
అయితే ఇప్పుడు శశికళ క్రీయాశీల రాజకీయాల్లోకి వస్తే తన పదవికి ఎక్కడ ఎసరువస్తుందో అనే భయంతో పన్నీరు సెల్వం వర్గ రాజకీయాలు చెయ్యడానికి సిద్దం అవుతున్నారని వారు ఆరోపించారు.

ఏ పని చేసినా జయలలిత ముందుగా శశికళతో చర్చిస్తారని, గతంలో పన్నీరు సెల్వంను రెండు సార్లు సీఎంగా చెయ్యకముందు కూడా శశికళతో ఆ విషయంపై అమ్మ చర్చించారని గుర్తు చేస్తున్నారు. జయలలిత, శశికళ అనుమతితోనే పన్నీరు సెల్వం గతంలో సీఎం అయ్యారని చెబుతున్నారు.
జయలలిత కోసం శశికళ జైలుకు కూడా వెళ్లారని, అమ్మ కోసం శశికళ తన జీవితాన్ని త్యాగం చేశారని, అలాంటి వ్యక్తి మాటలు కాదని పార్టీలో పన్నీరు సెల్వం ముందకు వెళ్లగలరా ? అంటు అన్నాడీఎంకేలోని శశికళ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.
జయలలిత స్థానంలో శశికళ ఉంటనే తమిళనాడు ప్రజలకు న్యాయం జరుగుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పదవి ఇచ్చిన జయలలిత, శశికళకు పన్నీరు సెల్వం జీవితాంతం రుణపడి ఉండాలని అంటున్నారు.
ఇదే సమయంలో సీఎం పన్నీరు సెల్వం మీద అన్నాడీఎంకేలోని ఓ వర్గం వారు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పేరుకేమో పన్వీరు సెల్వం, ఆయన మనసులో మాత్రం పన్నీరు లేదని అంటున్నారు. మొత్తం మీద అన్నాడీఎంకేలో వర్గ పోరు ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications